Masala Chai: మసాలా చాయ్ ఇప్పుడు ప్రపంచంలో 2వ బెస్ట్‌ డ్రింక్‌, దీని ఎలా తయారు చేసుకోవాలి అంటే..

Benefits Of Masala Chai: మసాలా చాయ్‌ని మసాలా టీగా కూడా పిలువబడే ఈ చాయ్‌ ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. టీలో వందల రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మసాలా టీ అన్నింటికంటే ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతంమసాలా టీ ఇప్పుడు ఆల్కహాల్ లేని పానీయాలలో రెండవ స్థానంలో ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 10:49 AM IST
Masala Chai: మసాలా చాయ్ ఇప్పుడు ప్రపంచంలో 2వ బెస్ట్‌ డ్రింక్‌, దీని ఎలా తయారు చేసుకోవాలి అంటే..

Benefits Of Masala Chai: మసాలా చాయ్ అనేది ఎంతో రుచికరంగా, సువాసనగల చాయ్‌.  దీనిని భారతీయులు ఎంతో ఇష్టంగా తాగుతారు. హిందీలో మసాలా అంటే సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిని చాయ్ లేదా టీ. ఈ మసాలా టీని చాలా మంది వివిధ రీతిలో తయారు చేస్తారు. ఈ చాయ్‌ కోసం మసాలా దినుసులు,  పాలు, నీరును ఉపయోగిస్తారు.ఈ మసాలా చాయ్ శీతాకాలంలో తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన ఈ చాయ్‌ జీర్ణక్రియ వ్యవస్థను పెంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

ఈ మసాలా చాయ్‌ ప్రస్తుతం  ప్రపంచంలో 2వ బెస్ట్‌ డ్రింక్‌గా పేరుపొందింది.  మొత్తం ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే నాన్ ఆల్కహాలిక్  టీ అని టేస్ట్ అట్లాస్ , ప్రముఖ ఫుడ్ అండ్ డ్రింక్ గైడ్  తెలుపుతుంది. టేస్ట్ అట్లాస్  మెక్సికో యొక్క అగువాస్ ఫ్రెస్కాస్ మసాలా చాయ్ కంటే ముందు జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీని పండ్లు, దోసకాయలు, పప్పులు, చక్కెర మరియు నీటితో తయారు చేస్తారు. భారత్‌లో లస్సీ మూడో స్థానంలో ఉంది.

మసాలా టీ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఆ చాయ్‌లో ఉపయోగించే లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల  కడుపు మంట, నొప్పి, గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి. అయితే ఈ లక్షణాలు కలిగిన చాయ్‌ ను మీరు కూడా ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతంది. అయితే ఈ చాయ్‌ ఎలా తయారు చేసుకోవాలి. 

మసాలా టీ కి కావలసిన పదార్థాలు:

మూడు స్పూన్‌ల లవంగాలు

¼ కప్పు యాలకులు

1 ½ కప్పులు  నల్ల మిరియాలు

రెండు దాల్చినచెక్క

 ¼ కప్ పొడి అల్లం 

ఒక టేబుల్ స్పూన్ జాజికాయ పొడి

మసాలా టీ తయారీ విధానం : 

ముందుగా లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చినచెక్కను నాన్‌ స్టిక్‌ పాన్‌లో వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.  ఇప్పుడు ఒక ప్లేట్‌ వీటిని తీసుకోవాలి. మసాలాలన్నీ చల్లారాక అల్లం, జాజికాయ వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో చిటికెడు మసాలా వేసుకొని చాయ్‌ను తయారు చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన మసాలా పూర్తిగా అవుతుంది. దీని తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చలికాలంలో దీని ఉపయోగించడం చాలా మంచిది.

Also read: Gobi Paratha: అదిరిపోయే ధాబా స్టైల్‌ గోబీ పరాటా.. కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News