Lighting Mask Diwali 2020 | ప్రపంచంలో నిత్యం కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. మార్కెట్లో నిత్యం కొత్త, వింతైన ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు వావ్ అనకుండా ఉండలేము. ఇప్పడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త అనంద్ మహీంద్ర తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశాడు. దీన్ని షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Diwali 2020 Gifts: దీపావళి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి 


If there’s one thing COVID-19 has demonstrated, it is that human beings will not tolerate being anonymous for very long...!
కోవిడ్ -19 వల్ల మరోసారి తేలిన విషయం ఏంటంటే.. మనుషుల్లో కళాపోషణ తగ్గదు అనే విధంగా ట్వీట్ చేశారు.


ఇందులో ఒక అమ్మాయి ముఖంపై ఒక మాస్కు కనిపిస్తుంది. అయితే ఈ మాస్కు ( Mask ) మనం వేసుకునే సాధారణ మాస్కు లాంటిది కాదు. అది మెరిసే మాస్కు ( Lighting Mask ). అది ప్రకాశవంతంగా వెలుతుగూ ఉంటుంది.


గులాబి, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో తళతళా మెరిపోతూ ఉంటుంది. మాస్కు రంగులు మార్చుకునే విధంగా చిన్న బటన్ కూడా ఇచ్చారు. దీంతో అమ్మాయి బటన్ సహాయంతో మాస్కు రంగులను ఇలా మారుస్తూ ఉంటుంది.



Also Read |  Diwali 2020 Rangoli: దీపావళికి ఈ 5 రకాల ముగ్గులను ట్రై చేసి చూడండి



ఇది చూసిన కొంతమంది నెటిజెన్లు ( Netizens ) ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. దీపావళి కొత్త మేకప్ అని కూడా అంటున్నారు.
కొంతమంది మంచి బిజినెస్ టాక్టిక్ అంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియా మొత్తం ఈ మాస్కుకు ఫిధా అయింది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR