ఈ దీపావళికి ఇంటికి వచ్చే బంధుమిత్రులను అందమైన ముగ్గులతో ఆహ్వనించండి

  • Nov 12, 2020, 22:01 PM IST

ఈ దీపావళి ( Diwali 2020 ) రోజు ఆనందం మీ ఇంట నెలకొనాలి. అందమైన జీవితానికి సరికొత్త ఆహ్వానంగా ఈ పండగ మారాలి. అయితే ఇంటికి వచ్చే అతిథులను ఆహ్వానంగా అందమైన ముగ్గులు వేస్తే ఎలా ఉంటుంది.  ఆ ఐదు డిజైన్లను ట్రై చేయండి. ముగ్గులను రంగోలి అని కూడా అంటారు. రంగోలి అంటే రంగుల ఆవలి అని అర్థం వస్తుంది. 

Also Read | Diwali 2020 ఈ దీపావళికి ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుందట, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

1 /5

ముగ్గుల్లో చాలా కామన్ గా కనిపించినా ఈ డిజైన్ స్పెషల్ ఎట్రాక్షన్ ఉన్నదే. ఎందుకంటే ఇందులో చాలా రకాల రంగులు. అయితే ఇప్పుడిప్పుడే ముగ్గులు ( Muggulu ) వేసే వారు మాత్రం కాస్త ఆలోచించి ప్రారంభించండి. అయితే ముందుగా నేలపై ఒక డ్రాయింగ్ వేస్తే కొత్త వారు కూడా అదరగొట్టగలరు అని మాత్రం చెప్పగలం.  

2 /5

రంగులు, డ్రాయింగ్స్ వద్దనుకుంటే ఇలా ప్లోరల్ ముగ్గులను కూడా డిజైన్ చేయవచ్చు. ఇదే ప్యాటర్న్ లో చేయాలి అని ఏం లేదు. మీకు నచ్చిన పువ్వులతో, నచ్చిన డిజైన్ల ముగ్గు వేసుకోవచ్చు.

3 /5

దీపావళి లుక్ కోసం ఈ ముగ్గు చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీరు రంగులు వాడవచ్చు, పువ్వులు కూడా వాడవచ్చు, జీవం కనిపించాలి అంటే దీపాలు కూడా పెట్టవచ్చు. దీపావళి రోజు సాయంత్రం పెడితే రాత్రి అయ్యే వరకు అద్భుతంగా వెలుగుతూనే ఉంటాయి.

4 /5

ఈ రంగోలి కొంచెం ఖరీదైంది. అయితే కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇందులో కనిపించే మెటీరియల్ తీసుకొస్తే చాలు మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు.

5 /5

మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఆక్రోలిన్ తీసుకుంటే చాలు సులువుగా ఇలా ముగ్గు డిజైన్ వేయవచ్చు