Diwali Smartphone Offers: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో భారీ ఆఫర్లకు ఇవాళే ఆఖరు రోజు
దీపావళి వచ్చేసింది. మీ స్నేహితులకో..ఇంట్లోవారికో మంచి స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా..లేదా మీరే కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే మీ కోసమే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లు దీపావళి ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చాయి. తక్కువ ఖర్చులో మంచి ఫోన్లు పొందడానికి ఇదే అవకాశం.
దీపావళి వచ్చేసింది. మీ స్నేహితులకో..ఇంట్లోవారికో మంచి స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా..లేదా మీరే కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే మీ కోసమే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లు దీపావళి ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చాయి. తక్కువ ఖర్చులో మంచి ఫోన్లు పొందడానికి ఇదే అవకాశం.
Diwali 2020 పేరుతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఈ వారం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ ( Flipkart Big Diwali sale ) , అమెజాన్స్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ భారీ డిస్కౌంట్లను అన్ని స్మార్ట్‌ఫోన్లకు అందిస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ( Amazon Great Indian Festival sale ) సేల్.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై పది శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఒక్కోకార్డుకు 15 వందల వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది. అటు ఫ్లిప్‌కార్ట్ కూడా Axis, Citibank, ICICI, Kotak Mahindra Bank లతో కలిసి 10 శాతం డిస్కౌంట్‌ను క్రెడిట్, డెబిట్ కార్డులపై అందిస్తోంది.
ఈ రెండు సంస్థలు స్మార్ట్‌ఫోన్లపై ప్రకటించిన ఆఫర్లలో కొన్ని మంచి డీల్స్‌ను మీ కోసం అందిస్తున్నాం. ఈ ఆఫర్లు నవంబర్ 13 వరకూ అంటే ఇవాళ్టి వరకూ అందుబాటులో ఉంటాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు
Samsung Galaxy M51
శాంసంగ్ కంపెనీకు చెందిన గెలాక్సీ ఎం51 ధరను తగ్గించింది. అమెజాన్‌లో ఇప్పుడు కేవలం 22 వేల 499 రూపాయలకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే అదనంగా 3 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 29 వేల ఈ స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 20 వేలకే లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Redmi Note 9 Pro
రెడ్ మి నోట్ 9 ప్రో ఇప్పుడు 12 వేల 999కే లభిస్తుంది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా. ఎక్చ్జేంజ్ ఆఫర్ లో 11 వేల 590 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.
Oppo A52
ఒప్పో ఏ 52 ఇప్పుడు కేవలం 15 వేల 990 కే అమెజాన్‌లో లభిస్తుంది ప్రత్యేక ఆఫర్ ద్వారా. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా 11 వేల 950 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. రేర్ కెమేరా 12 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమేరా 16 మెగా పిక్సెల్ ఉంది.
iPhone 11
యాపిల్ సంస్థకు చెందిన ఐ ఫోన్ 11 ఇప్పుడు కేవలం 50 వేల 999 రూపాయలకే ఈ ఆపర్‌లో లభిస్తుంది. ఈ ఆపర్‌లో ఇయర్ పాడ్స్, ఛార్జర్ కూడా లభిస్తాయి.
OnePlus 8
వన్ ప్లస్ 8 ( 6 జిబి, 128 జిబి ) ఇప్పుడు కేవలం 39 వేల 999 రూపాయలకే లభిస్తుంది. అసలు ధర 41 వేల 999 రూపాయలుగా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. Also read: Electricity Bill: కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందా..ఇలా చేస్తే చాలు
ఫ్లిప్‌కార్ట్‌పై బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు ఇవే
Samsung Galaxy S20+
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో కేవలం 54 వేల 999 రూపాయలకే లభిస్తుంది. అసలు ధర 83 వేలుగా ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 14 వేల 6 వందల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
iPhone 11 Pro
ఐ ఫోన్ 11 ప్రో ఇప్పుడు కేవలం 79 వేల 999 రూపాయలకే లభిస్తుంది ఫ్లిప్ కార్ట్ ఆఫర్‌లో. అసలు ధర 1 లక్షా 6 వేల 6 వందల రూపాయలుగా ఉంది. ఎక్స్చేంజ్‌లో భాగంగా మరో 14 వేల 100 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
Moto G9
మోటో జి 9 ఇప్పుడీ ఆఫర్‌లో భాగంగా కేవలం 9 వేల 999 రూపాయలకే లభిస్తోంది. అసలు ధర 14 వేల 999 రూపాయలుగా ఉంది. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమేరాను కలిగి ఉంది.
Samsung Galaxy Note 10+
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా 59 వేల 999 రూపాయలుగా ఉంది. అసలు ధర 85 వేలుగా ఉంది. నో కాస్ట్ ఈఎంసీ సౌకర్యం కూడా ఉంది.
iPhone SE
యాపిల్ సంస్థకు చెందిన ఐ ఫోన్ ఎస్ఈ 64 జిబి ఇప్పుడీ ఆఫర్‌లో భాగంగా కేవలం 32 వేల 999 రూపాయలకే లభిస్తోంది. అసలు ధర 39 వేల 9 వందల రూపాయలుగా ఉంది. Also read: ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్ Deactivate అవుతుంది!