Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..
florida forceful sneeze: అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఫ్లోరిడాలోని రెస్టారెంట్ కు వచ్చాడు. అప్పుడు అతనికి ఒక్కసారిగా తుమ్ము వచ్చింది.
Elderly us mans colon falls out of body after: కొందరికి ఎలర్జీ చాలా ఉంటుంది. కొంచెం వెదర్ మారిపోగానే తుమ్ములు వస్తుంటాయి. దుమ్ములో వెళితే, ట్రాఫిక్ లో, పర్ఫూమ్ పెట్టుకున్న కూడా ఆ వాసన అస్సలు పడదు. వెంటనే తుమ్ముల మీద తుమ్ములు వచ్చేస్తుంటాయి. ఇక ఇళ్లు శుభ్రం చేసినప్పుడు కొందరు ముఖానికి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయిన కూడా తుమ్ములతో తెగ ఇబ్బందుతు పడిపోతుంటారు. కొందరు చాలా గట్టిగా తుమ్ముతారు. వీరి తుమ్ము వీధి చివరి వరకు కూడా వినిపిస్తుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే జడుసుకుని నిద్రనుంచి ఒక్కసారిగా ఏడ్చుకుంటూ లేస్తారు. అయితే.. ఇటీవల అమెరికాలో ఒక అనుకొని ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తుమ్మితే ఏకంగా అతని పొట్ట చెక్కలై పేగులు బైటపడ్డాయి. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
పూర్తి వివరాలు..
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి (63) తన భార్యతో కలిసి స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ తనకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ ఆర్టర్ చేశారు. తన భార్యతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఇంతలో మనోడికి ముక్కులో దురద పుట్టి ఒక్కసారిగా పెద్ద తుమ్ము వచ్చింది. దాని వెంటనే దగ్గు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అతను గట్టిగా తుమ్మి, దగ్గాడు. అప్పటికే అతని పొట్ట భాగమంతా రక్తంతో తడిచిపోయింది. అతగాడు నొప్పిని భరించలేక విలవిల్లాడిపోయాడు. డ్రెస్ అంతా రక్తంతో తడిసిపోయింది. అసలు ఏంజరిగిందా అని ఆలోచిస్తే.. అతని పొట్ట భాగాన్ని చీల్చుకొని, పెద్ద ప్రేగులు బయటకు వచ్చాయి. దీంతో అతనితో పాటు, భార్య కూడా ఖంగుతింది.
అక్కడున్న వారు.. వెంటనే అంబులెన్స్‌కి సమాచారం అందించారు. హోటర్ సిబ్బంది రక్తం కారకుండా చొక్కాతో పొట్టను కప్పి ఉంచారు. అయిన కూడా తీవ్రంగా రక్త స్రావం జరిగింది. అతను బాధను భరించలేక విలవిల్లాడిపోయాడు. అక్కడికి అంబులెన్స్ రాగానే.. హుటాహుటిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాధితుడికి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. పొట్ట చీల్చుకొని వచ్చిన ప్రేగుల్ని సరిగ్గా అమర్చి, ఎనిమిది వరకు కుట్లు వేశారు. ఇది అత్యంత అరుదైన కేసు అని, ఇప్పుడు అతని పొట్ట తెరుచుకునే అవకాశమే లేదని వైద్యులు తెలిపారు.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
అదృష్టవశాత్తూ.. రక్తం ఎక్కువగా బయటకు రాకపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బతికాడని డాక్టర్లు చెప్పారు. కాగా.. అతని పొట్ట చీల్చుకొని బయటకు ప్రేగులు రావడానికి మరోక కారణం ఉంది. అతను.. నిజానికి.. ఆ వ్యక్తి కొంతకాలం నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కొన్నిరోజుల క్రితమే అతను ఉదర శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అతనికి తుమ్ము గట్టిగా రావడంతో.. మూడు అంగుళాల కుట్లు తెగి, ఇలా ప్రేగులు బయటకు వచ్చినట్లు సమాచారం.ఈ ఘటన మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter