Fire Broke Put in the Mariage Hall: ప్రస్తుతం సోషల్  మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది.. పెళ్లి జరుగుతున్న ఓ కళ్యాణ పండపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  కానీ అగ్నిప్రమాదం జరిగినప్పటికీ.. పెళ్లికి వచ్చిన అతిధులు మాత్రం పట్టించుకోకుండా భోజనం చేయటం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharahtra) థానేలోని (Thane) అన్సారీ మ్యారేజ్ హాల్‌లో ఆదివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు, మరణాలు సంభవించినట్లు ఎటువంటి సమాచారం అందకపోవడం ఉపశమనం కలిగించే అంశం. కల్యాణ మండపంలో మంటలు చెలరేగడంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చేరుకున్నారు.


Also Read: Nagini Dance: మైమరచిపోయి పాములు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో చూడండి! Viral Video


మంటలు ఎగిసిపడుతున్న పట్టనట్టు ఉన్న జనం 
కళ్యాణ మండపంలో భారీ అగ్నిప్రమాదం జరిగినప్పటికీ.. పెళ్లికి వచ్చిన అతిధులు మాత్రం ఫుడ్ తింటూ ఉండటంతో వీడియో తెగ వైరల్ గా మారింది. చాలా మంది తినటానికి.. అక్కడి నుండి త్వరగా వెళ్లిపోవటానికి ప్రయత్నించారే తప్ప.. ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి ఏం జరిగిందో కూడా చూడకపోవటం గమనార్హం. సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్ గా మారింది.. ఇలాంటి వారిపై నెటిజన్లు తెగ ఆగ్రహానికి గురవుతున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ప్రజలు ఎలా సాధారణంగా ఉంటూ... ఆహారం తింటూ ఉంటారు అని ఆశ్చర్యపోతున్నారు.. 


కళ్యాణ్ మండపం మొత్తం మంటలు
కళ్యాణ మండపంలో మంటలు ఎలా వచ్చాయో తెలియదు కానీ.. ఎలాగోలా వధూవరులను అక్కడి నుండి బయటకి తీసుకొచ్చారు. అక్కడి ఎవరికీ గాయాలు కాకపోవటం.. అందరు బయటపడటం ఊరటనిచ్చింది. 




Also Read: Nellore Anandaiah: త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా-నెల్లూరు ఆనందయ్య సంచలన ప్రకటన


మంటలు ఆర్పటానికి 3 గంటల శ్రమ 
కళ్యాణ మండపంలో మంటలను ఆర్పేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆపటానికి అగ్నిమాపక దళానికి చెందిన 6 వాహనాలు.. దాదాపు 3 గంటల సమయం పట్టింది. కానీ అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు.


కళ్యాణ మండపంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా.. ?? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా దోషులుగా తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook