First Water Taxi: కేరళలో తొలి వాటర్ టాక్సీ ప్రారంభం! వీడియో చూడండి!
భారత దేశంలో ( India) తొలి వాటర్ ట్యాక్సీ సర్వీస్ ప్రారంభం అయింది. కేరళలో ( Kerala ) ఈ సర్వీసు ప్రారంభం అయింది. బోటు ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
భారత దేశంలో ( India) తొలి వాటర్ ట్యాక్సీ సర్వీస్ ( First Water Taxi Services ) ప్రారంభం అయింది. కేరళలో ఈ సర్వీసు ప్రారంభం అయింది. బోటు ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాపుజా బ్యాక్ వాటర్స్ పై తొలి నీటి టాక్సీని మొదలు పెట్టడంతో అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇకపై నాణ్యమైన సేవలతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. దాంతో పాటు ట్యాక్సీ వచ్చే సమయంలో.. అది రీచ్ అయితే సమయం తెలియడంతో తమ పనులు వేగవంతంగా పూర్తవుతాయి అని అంటున్నారు ప్రజలు.READ ALSO | Hyderabad Floods: చిన్నపాటి వర్షానికే జామ్...రోడ్డుపై ఈదుతూ వెళ్లిన వ్యక్తి
ఫస్ట్ వాటర్ టాక్సీ సర్వీసు గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దీని విశేషాల గురించి మాట్లాడితే ఇందులో 10 మంది ఒకే సారి ప్రయాణించవచ్చు. అంటే ఒక పెద్ద కుటుంబానికి ఇది చక్కగా సరిపోతుంది. దాంతో పాటు పూల్ గా ఏర్పడి కూడా బోటులో ప్రయాణం చేసుకోవచ్చు. కేటామరన్ డీజల్ పవర్ తో ఈ బోటు ట్యాక్సి నడుస్తుంది.
ఇలా నాలుగు వాటర్ టాక్సీ సిర్వీసును ప్లాన్ చేయగా.. అందులో లాంచ్ అయిన తొలి బోటు ఇది. కేరళ ( Kerala ) రాష్ట్ర ట్రాన్సుపోర్ట్ విభాగం వీటిని ప్రజల కోసం ప్రవేశపెట్టింది.
ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR