African Bride and Indian Groom Wedding Dance Video: వివాహం అనేది భారతదేశ సంప్రదాయాలు ప్రకారం ఒక ప్రత్యేకమైన మరియు సంతోషకరమైన పండుగ. పెళ్లి చేసుకునే జంట మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు అందరు కలిసి చేసుకునే ఒక సంబరమనే చెప్పాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్యాన్స్, జోక్స్ లేకుండా పెళ్లిలు జరగవు, ఒకవేళ డ్యాన్స్ లేని పెళ్లిలో మజా మాత్రం ఉండదు. మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి తరువాత పెళ్లి కూతురుని అత్తారిటింకి పంపే క్రమంలో డ్యాన్స్ చేయటాన్ని "భరాత్" అని పిలుస్తుంటారు. ఇపుడున్న కొనసాగుతున్న ట్రెండ్ ఏంటంటే.. బంధువులు, సన్నిహితులు మాత్రమేకాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేయటం. మొన్న ఒక పెళ్లి జంట డుగ్గు డుగ్గు బుల్లె బండి పాట పైన చేసిన డ్యాన్స్ వీడియో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే.. ఆ జంట సెలబ్రెటీ అయిన సంగతి కూడా తెలిసిందే.. వధు-వరులు కూడా జీవితంలో ఒకే సరి వచ్చే వివాహాం అనే మధుర ఘట్టాన్ని ముఖ్యమైన క్షణాలుగా మార్ఫ్చుకోటానికి డ్యాన్స్ లు వేస్తున్నారు. 


Also Read: Most Eligible Bachelor Trailer: మన లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం 9వేల నైట్స్ కలిసి పడుకోవాలి


ఇపుడు ఇదంతా ఎందుకు అనుకోకండి.. దీనికో కారణం ఉంది.. ప్రస్తుతం పెళ్లిలో వధు-వరులు రోడ్డుపై చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూస్తే పెళ్లి జరిగిన ప్రదేశం మన దేశంలో కాకపోయినా.. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినదని తెలుస్తుంది. వధువు  ఆఫ్రికా దేశానికి చెందిన యువతిగా వరుడు భారతదేశానికి చెందిన యువకుడిగా మరియు వివాహాం భారత సంప్రదాయం ప్రకారం జరిగిందని తెలుస్తుంది 


వీడియోలోకి వెళ్తే.. ముందుగా, వరుడు పాటలో ఉన్న రిథమ్ కి అనుగుణంగా డ్యాన్స్ చేయటం ప్రారంభిస్తాడు. వరుడు డ్యాన్స్ చూసాకా వధువు తనను తాను కంట్రోల్  చేసుకోలేక డ్యాన్స్ చేయటం ప్రారంభిస్తుంది. 


Also Read: Viral Video: కేంద్ర మంత్రి ఓ మంచి డ్యాన్సర్: ప్రధాని మోదీ



ఇక ఇద్దరు ఒకేరకంగా డ్యాన్స్ చేయటం.. వధువు మైమరచిపోయి డ్యాన్స్ చేయటం చూసిన చుట్టూ జనాలు ఆశ్చర్యానికి లోనవుతారు 


శివమ్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో "ఆఫ్రికన్ అమ్మాయి.. ఇండియన్ అబ్బాయి పెళ్లి డ్యాన్స్" అనే టాగ్ తో ఈ వీడియో పోస్ట్ చేసాడు. ఫన్నీ గా సాగే ఈ పెళ్లి డ్యాన్స్ వీడియో వైరల్ అవ్వగా.. 188,151 లైక్స్ మరియు వేలల్లో కామెంట్స్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు అభినందిస్తూ, 'సూపర్ డ్యాన్స్' (Super Dance) అని మరికొందరు 'పర్ఫెక్ట్ పెయిర్' (Perfect Pair) అని కామెంట్ చేస్తున్నారు. 


Also Read: Scary Video: చేతి కర్రతో చిరుతతో పోరాటం.. ప్రాణాలు కాపాడుకున్న వృద్దురాలు


ఈ వీడియో లో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వధు-వరులు చుట్టూ ఉన్న వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా మైమరచిపోయి డ్యాన్స్ చేయటమే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook