Viral Video: కేంద్ర మంత్రి ఓ మంచి డ్యాన్సర్: ప్రధాని మోదీ

kiren rijiju: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు స్థానికులతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 08:11 PM IST
  • అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో పర్యటించిన కేంద్ర మంత్రి
  • స్థానికులతో కలిసి నృత్యం చేసిన కిర‌ణ్ రిజిజు
  • న్యాయ‌శాఖ మంత్రి మంచి డ్యాన్సర్ అని ప్రధాని కితాబు
Viral Video: కేంద్ర మంత్రి ఓ మంచి డ్యాన్సర్: ప్రధాని మోదీ

PM Comments On Minister Kiren Rijiju's Dance Video: బుధవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజ్ అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh)లో పర్యటించారు. ఈ టూర్ లో భాగంగా ఓ  గ్రామంలో ఆయన నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజ్‌(Union Law Minister Kiren Rijiju) పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి రాష్ట్రంలోని కజలాంగ్ గ్రామాన్ని (Kazalang village) సందర్శించారు.

ఈ క‍్రమంలో మిజి అని పిలువబడే స్థానిక సజోలాంగ్ ప్రజలు తమ సాంప్రదాయ పాటలు నృత్యాలతో కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. ప్రజలంతా కరతాల ధ్వనులు చేస్తుంటే.. ఒక్కొక్కరిగా వచ్చి తమ సంప్రదాయ నృత్యం చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కూడా నృత్యం చేసి అక్కడి ప్రజలను ఉత్సాహపరిచారు. తాను చేసిన సంప్రదాయ డ్యాన్స్‌ వీడియో(Dance Video)ను కిరణ్‌ రిజిజ్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌చేశారు. 

Also Read; Amarinder Singh: భాజపాలో చేరను.. కాంగ్రెస్‌లోనూ ఉండను: అమరీందర్‌

ప్రస్తుతం ఆయన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేం‍ద్రమంత్రి నృత్యంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. ‘కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజ్‌ కూడా ఓ మంచి డ్యాన్సర్‌, అద్భుతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ సంస్కృతిని చూడటం చాలా ఆనందంగా ఉంది’అని పేర్కొన్నారు. ​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News