Gandhi Hospital: గాంధీలో గ్యాంగ్ రేప్.. అక్కా- చెల్లెలపై 5 గురు అత్యాచారం
చికిత్స కోసం పేషంట్ కు తోడుగా వచ్చిన అక్కా-చెల్లెలపై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేసే ఉమామహేశ్వర్ అతడితో పాటు మరో నలుగురు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారం జరపటం నగరంలో కలకలం రేపింది.
హైదరాబాద్ (Hyderabad)గాంధీ ఆసుపత్రి(gandhi hospital).. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చుట్టూ పక్కల ఉన్న అన్ని రాష్ట్రల ప్రజలు వచ్చి చికిత్స చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రి. నిత్యం వందల మంది రోగులు వచ్చి వెళ్తూ ఉండే ప్రదేశం. రాజధాని నడిబొడ్డున ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఒక అమానుష ఘటన జరిగింది. రోడ్లు, మందిరాలు, థియేటర్లలోనే కాదు ఆకరికి ఆసుపత్రుల్లో కూడా మహిళలపై కామంధులు రెచ్చిపోతున్నారు.
మూత్రపిండాలు పాడైన బావను తీసుకొని, అక్కకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన అక్క-చెల్లెల్లపై 5 గురు సాముహిక అత్యాచారం జరగటం అది ఆలస్యంగా వెలుగులోకి రావటం నగరంలో కలకలం రేపుతుంది.
Also Read: Karnataka: బెంగళూరులో పెరుగుతున్న కంటైన్‌మెంట్ జోన్లు, ఎక్కువగా అపార్ట్‌మెంట్లే
వివరాల్లోకి వెళ్తే...
మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కిడ్నీలు పాడవటంతో చికిత్స కోసం ఈ నెల 4 వ తేదీన గాంధీ ఆసుపత్రికి అతడి భార్య, మరదలు తీసుకొచ్చారు. అదే గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ (Radiologist) విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్ (Uma maheshwar) అనే వ్యక్తి వారికి దూరపు బంధువు కావటంతో అతని సహాయంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు, అయితే 7 వ తేదీ నుండి భార్య- మరదలు పేషంట్ ను చూడటానికి రాకపోవటంతో ఇంటి దగ్గర ఉన్న 17 ఏళ్ల కుమారుడికి కబురు పెట్టాడు. ఎంత వెతికినా వారి ఆచూకి లభించక పోవటంతో, 11 తేదీన తన తండ్రిని ఇంటికి తీసుకుల్లాడు. చివరకి ఆదివారం నాడు 17 ఏళ్ల కుమారుడుకి ఉమామహేశ్వర్ నుండి ఫోన్ రాగా.. "ఆసుపత్రి వెనుక ఖాళీ భాగంలో మీ పిన్ని బట్టలు లేకుండా పడి ఉందని" కబురందటంతో హుటాహుటిన చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న పిన్ని చూసి, తనకు సపర్యలు చేసి ఏం జరిగింది అని అడగ్గా.. తనపై జరిగిన అత్యాచారం గురించి తెలిపిందని అతడు వివరించాడు. వివరాలన్ని చెప్పే స్థితిలో లేని ఆమెను స్వంత ఊరికి తీసుకెళ్ళి కొంచెం కుదుటపడ్డాక అన్ని వివరాలు తెలుస్తాయని భావించాడు.
ఫిర్యాదు:
సోమవారానికి కోలుకున్న భాదితురాలు.. తనపై ఉమామహేశ్వర్ తో పాటు మరో నలుగురు అత్యాచారం చేసారని తెలిపింది. రుమాలులో మత్తు మంది స్ప్రే చేసి, ముఖభాగంలో ఒత్తి పట్టరాని... స్పృహ కోల్పోయాక సెల్లార్ లోకి తీసుకెళ్ళి అందరు కలిసి అత్యాచారం చేసారని తెలిపింది. వెంటనే రోగి కుమారుడు మహబూబ్‌నగర్ పోలీసులకు (Mahabubnagar Police station) ఫిర్యాదు చేయగా.. ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదనీ, గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ (secunderabad) చిలకలగూడ పోలీస్‌స్టేషన్ (Chilkalguda Police station) పరిధిలో ఉన్నందున అక్కడకి వెళ్లి ఫిర్యాదు చేయమని కోరాటంతో, బహాదితురాలిని తీసుకొని అక్కడ ఫిర్యాదు చేసారు.
Also Read: Flying Car: త్వరలో ఇండియాలో మేకిన్ ఇండియా ఫ్లైయింగ్ కారు
కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా భాదితురాలి ఫిర్యాదు తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఉమామహేశ్వర్‌పై రేప్ కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు ఉమామహేశ్వర్ తో పాటు మిగతా నలుగురి కోసం పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి వారిని వెతికే పనిలో ఉన్నారు.. ఇప్పటికీ అక్కా ఆచూకి ఇంకా లభించకపోవటం భాదితురాలి కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచి వేస్తుంది.
అసలేం జరిగింది, ఈ నెల 7 వ తీదీ నుండి 15 వ తేదీ వరకి అక్క-చెల్లెలు ఎక్కడున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కోన సాగిస్తున్నారు. ఐదు రోజులుగా ఉమామహేశ్వర్ విధులకు సరిగ్గా హాజరు కావట్లేదని.. వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి కంగారుగా వెళ్లిపోతున్నాడని, తోటి ఉద్యోగులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ వివరాల మేరకు పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook