Girl can't control her happiness in ATM: సాధారణంగా వైరల్ వీడియోలు (Viral Videos) కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, కొన్ని భయాన్ని కలిగిస్తాయి, మరి కొన్ని నవ్వుతో మనసును ఆనందింప చేస్తాయి. ఇపుడు చూడబోయే వీడియో చివరి రకానికి చెందినది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏటీఎంలో (ATM) డబ్బులు డ్రా చేస్తున్న యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) విపరీతంగా వైరల్ అవుతోంది. సాలరీ క్రెడిట్ అయిన విషయం తెలిసాక ఆ అమ్మాయి ఆనందం అంతా ఇంతా కాదు..  ఏకంగా ఏటీఎంలో చిందేసింది. సాలరీ బ్యాంకు అకౌంట్లో పడ్డాక ప్రతి ఒక్కరి ఆనందం ఇంతే కానీ... ఆ ఆనందాన్ని అందరు దాచుకుంటే.. ఈ అమ్మాయి డ్యాన్స్ తో వ్యక్త పరచిందని అంటున్నారు.


Also Read: MAA Elections 2021: 'మా' ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం


ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) కనిపించిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. వీడియోలో యువతి బ్లాక్ టాప్ వేసుకొని, బ్లాక్ మాస్క్ ధరించింది. ATM పిన్ ఎంటర్ చేసేప్పుడు నటుడు జీవితరాజశేఖర్ (Hero Jeevitha Rajashekar) స్టెప్పులు వేసిన... డబ్బులు వచ్చిన వెంటనే ఊర మాస్ స్టెప్పులతో రెచ్చిపోయి, మైమరచిపోయి డ్యాన్స్ చేసింది.


'గంటా' అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో...  "ఖుషి దేఖ్ రహే హో సాలరీ కి"  (సాలరీ వచ్చాక ఆనందం చూసారా..) అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేయబడింది. అప్‌లోడ్ చేసిన కొన్ని క్షణాల్లో వీడియో వైరల్ (Video Viral) అయింది.



Also Read: Lakhimpur Kheri violence: నిర్బంధంలో ప్రియాంక.. చీపురు పట్టి ఊడ్చిన వీడియో వైరల్


వీడియో చూసిన కొంత మంది "సాలరీ వచ్చాక ఇదే కదా చేయాల్సింది" అని కొంత మంది కామెంట్స్ చేస్తుండగా..  "బాయ్ ఫ్రెండ్ ATM తెచ్చినట్లుంది" అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ వీడియోకు కేవలం మూడు రోజుల్లో 34 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook