MAA Elections 2021: 'మా' ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం

రోజు రోజుకు రసవత్తరంగా కొనసాగుతున్న 'మా' ఎలక్షన్స్ పై ఏపీ సర్కాకు కీలక ప్రకటన చేసింది. 'మా' ఎన్నిలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఖరాకండిగా తేల్చి చెప్పేసారు మంత్రి పేర్నినాని.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 05:30 PM IST
  • మా ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం
  • మా ఎలక్షన్లతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటన
  • మాకు ఎలాంటి ఉత్సాహం ఆసక్తి లేదన్న పేర్నినాని
MAA Elections 2021: 'మా' ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం

MAA Elections 2021: అక్టోబర్ 10 వ తేదీన జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (Movie Artists Association Elections 2021) ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కారు (AP Government )కీలక ప్రకటన చేసింది. రానున్న రోజుల్లో జరగబోయే 'మా' ఎన్నికలతో ఏపీ  ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్నినాని (Perninani) స్పష్టం చేశారు. 

తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలందరికీ ప్రభుత్వం తరపున "'మా' ఎలక్షన్ల పట్ల మా అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్ కు ఎలాంటి సంబంధం లేదని, ఎన్నికల పట్ల ఎలాంటి ఆసక్తి, ఉత్సాహం లేవని" పేర్నినాని తెలియపారు.

Also Read: Lakhimpur Kheri violence: నిర్బంధంలో ప్రియాంక.. చీపురు పట్టి ఊడ్చిన వీడియో వైరల్

ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు (Manchu Vishnu) సీఎం జగన్ (CM Jagan)కు సమీప బంధువు అన్న విషయం తెలిసిందే.. ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ (Prakash Raj Panel)కు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు మెగా కుటుంబం సపోర్ట్ చేస్తున్నారని ఫిల్మ్ సిటీ లో ప్రచారం  జరుగుతుంది. 

ఒక రకంగా మా ఎన్నికలు పవన్ కళ్యాణ్ Vs సీఎం జగన్ (Pawan Kalyan Vs CM Jagan) అని కొందరు ఉద్దేశ్య పూర్వకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మంత్రి పేర్నినాని "తమ ప్రభుత్వానికి మరియు 'మా' ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని" ప్రకటించారు. 

Also Read: Hero Ram Pothineni Injured: గాయపడ్డ హీరో 'రామ్ పోతీనేని'...'రాపో19' షూటింగ్ కు బ్రేక్!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల (MAA Elections 2021) ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌ (PrakashRaj) అసోసియేషన్‌ సభ్యులతో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో విష్ణు ప్యానల్‌ (Vishnu panel) నరేశ్‌లపై ఆయన మండిపడ్డారు. 

ఈ సారి జరగనున్న 'మా' ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని.. పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే 'మా అధ్యక్షుడిగా గెలవాలని పేర్కొన్నారు. ఆ సత్తా తనకి ఉందని.. అందుకే తాను ఈ సారి ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

సాధారణంగా జరిగే మా ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలను ఎందుకు చేరుస్తున్నారని, పోటీ చేసే ప్యానల్ లు ఇప్పటి వరకు మేనిఫెస్టోలు విడుదల చేయకపోగా.. అనవసరమైన మాటలు వదులుతున్నారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. 

Also Read: Aryan Khan Arrest: 'నా కొడుకు ఏదైనా చేయొచ్చు'.. షారుక్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియో వైరల్

చదువు రాని నరేష్ (Actor Naresh) ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి, 'మా' అసోసియేషన్ సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నావ్!. నన్ను తెలుగువాడు కాదన్నారు. కానీ నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికి రాదు. నన్ను పెంచింది తెలుగు భాష. 'మా' అసోసియేషన్‌ కోసం బాధ్యతతో పనిచేయాలని వచ్చానని' ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

మంచు విష్ణు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రకాష్ రాజ్ ఘాటు గానే సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News