Brave Lion escapes from 40 Crocodiles in Water: సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతు ప్రపంచానికి సంబంధించి ఎన్నో వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా సింహం, చిరుత, ఏనుగులకు సంబందించినవి ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని నవ్వులు పూయించే వీడియోలు ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో భయానకరంగా ఉంది. మొసళ్ల గుంపు మధ్య నుంచి ఓ సింహం చాకచక్యంగా తన ప్రాణాలను కాపాడుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెన్యా మసాయ్‌ మరా నేషనల్‌ రిజర్వ్‌ పార్క్‌లో మే 23న ఆంటోనీ పెసీ ఈ వీడియోను చిత్రీకరించాడు. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. దాని మీద ఓ సింహం కూడా ఉంది. సింహంను చూసిన మొసళ్లు దానివద్దకు చేరుకున్నాయి. ఒకటో, రెండో కాదు ఏకంగా 40 మొసళ్లు వచ్చి సింహంను చుట్టుముట్టాయి. అయినా కూడా సింహం ఏ మాత్రం జంకకుండా.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా తప్పించుకునే ఉపాయాన్ని అలోచించింది.



హిప్పో మీదే ఉండిపోయిన ఆ సింహం.. సమయం కోసం వేచిచుసింది. నీటిలో ఉన్న మొసళ్ల గుంపు దాన్ని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. సమయం మించిపోతుండడంతో.. సింహం అదను చూసి నీళ్లలోకి దూకింది. మొసళ్లపైనే అడుగులు వేస్తూ.. నది ఒడ్డుకు చేరింది. ఒడ్డు వరకు గుంపులుగా వచ్చిన మొసళ్లు నిరాశలో ఉండగా.. బతుకు జీవుడా అనుకుంటూ సింహం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోకి యూట్యూబ్‌లో 33,700 వ్యూస్‌ వచ్చాయి. 


Also Read: భారత కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. 12 నెలలో ఆరుగురు కెప్టెన్లు! టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌ కష్టమే


Also Read: Trending Video: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. వధువును తన్నిన వరుడు, తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook