Viral Video: నువ్వు గ్రేట్ భయ్యా.. రూ. 4 లక్షలు ఖర్చు చేసి కారుకు అంత్యక్రియలు.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..
Gujarat Lucky Car burial Ceremony: గుజరాత్ కు చెందిన ఒక వ్యాపారీ రూ. 4 లక్షలు ఖర్చుచేని తన కారుకు అంత్యక్రియలు చేశాడు. అంతే కాకుండా.. దాదాపు పదిహేను వేల మందికి భోజనాలు కూడా పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gujarat family holds burial ceremony for lucky car video goes viral: సాధారణంగా చాలా మంది కొన్ని విషయాల పట్ల ఎంతో ఎమోషనల్ గా ఉంటారు. కొందరు నాదీ అనుకున్న మనుషులతో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. మరికొందరు వస్తువులను కొంటారు. సెల్ ఫోన్ లు, కాస్లీ కారుల మీద తమ మనస్సు పెట్టుకుంటారు. మరికొందరు పెంపుడు జంతువుల మీద తమ ప్రేమను చాటుకుంటారు. వీటిని తెచ్చుకున్నాక.. కనుక వీరి లైఫ్ లో ఏదైన మంచి జరిగితే.. అనుకొని విధంగా లక్ కలిసి వస్తే ఇక ప్రాణంకన్న ఎక్కువగా చూసుకుంటారు.
అస్సలు వాటిని వదిలి పెట్టి ఉండరు. అయితే.. ప్రస్తుతం గుజరాత్ కు చెందిన ఒక రైతు వ్యాగనార్ కారును పన్నేండెళ్ల క్రితం కొన్నాడు. అప్పటి నుంచి అతని జాతకం మారిపోయిందంట. ఏపనిచేసిన కూడా కలిసి వచ్చిందంట. దీంతో అతను కోటీశ్వరుడైపోయాడు. తాజాగా, అతను తన కారుకు అంత్యక్రియలు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
గుజరాత్‌కు చెందిన ఒక రైతు కుటుంబం తమ పాత కారుకి అంత్యక్రియలు చేశాడు. ఏదో సింపుల్ గా కాకుండా.. అదేదో మనిషి పోయినట్లు కూడా అంతిమ సంస్కారాలు చేశాడు. దీని కోసం..రూ. 4 లక్షలు ఖర్చు చేశాడు. అమ్రేలి జిల్లా లాథి తాలూకాలోని పదర్‌శింగ గ్రామానికి చెందిన సంజయ్ పోలారా కుటుంబం గురువారం (నవంబర్ 9) తమ పాత కారును పొలంలో సమాధి చేశారు. దీని కోసం 15 అడుగుల లోతులో పొలంలో గొయ్యి తీసినట్లు తెలుస్తొంది. ఆ కారు పూర్తిగా పాడైపోయింది.
అంతే కాకుండా.. దాన్ని రీసైక్లింగ్ కు ఇచ్చేందుకు అతనికి మనసొప్పలేదు. దీంతో 12 ఏళ్లుగా ఆ కారుతో ఉన్న అనుబంధం కారణంగా.. తన పొలంలోనే.. ఆ కారును గొయ్యి తవ్వి.. అంత్యక్రియలు చేసినట్లు తెలుస్తొంది. ఈ సందర్భంగా.. పదర్ శింగ సుమారు 1500 మందికి విందు భోజనాలు ఏర్పాటు చేసి, సాధువులతో ప్రత్యేకంగా పూజలు సైతం చేసినట్లు సమాచారం.
Read more: Snakes: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. పాములకు రెడ్ కార్పేట్ వేసినట్లే.. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయ్..
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. అంతిమ వీడ్కోలు సందర్భంగా కారును పచ్చని గుడ్డతో కప్పి, పూలమాలలతో డెకొరేట్ చేశారు.. కుటుంబ సభ్యులు ఏడుస్తూ.. మనిషికి వీడ్కోలు పలికినట్లు కారుకు వీడ్కోలు పలికారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. వామ్మో.. ఇదేందిరా బాబోయ్ అంటూ షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.