Miami Beach helicopter crash: ఆ బీచ్ సందర్శకులతో కళకళ్లాడుతోంది. కొందరు సముద్రతీరంలో ఈత కొడుతుంటే...మరికొందరు ఒడ్డున కూర్చుని సేద తీరుతున్నారు. ఇంతలో అందరూ చూస్తుండగానే ఆకస్మాత్తుగా ఓ హెలికాప్టర్ (Helicopter Crash) వచ్చి సముద్రం ఒడ్డున కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటన అమెరికా ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో (Miami Beach) చోటుచేసుకుంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


శనివారం మియామీ నగరంలోని సౌత్ బీచ్ లో ప్రజలు ఎంజాయ్ చేస్తున్న సమయంలో..ఆకాశంలో అదుపుతప్పిన ఓ హెలికాప్టర్ ఒక్కసారిగా బీచ్ ఒడ్డు నుంచి పది మీటర్ల దూరంలో సముద్రంలో కుప్పకూలింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో జనాలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు.


ప్రమాద సమాచారం అందుకున్న మియామీ బీచ్ పోలీసులు (Miami Beach Police).. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. సాంకేతిక కారణాలతోనే హెలికాప్టర్ కూలినట్లు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. కుప్పకూలిన హెలికాప్టర్ 'రాబిన్‌సన్ ఆర్‌44'గా గుర్తించారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అధికారులు, జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని మియామీ బీచ్ పోలీసులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  


Also Read; Viral Video: కుక్కే కదా తన్ని పడేద్దామనుకున్నాడు.. కానీ సీన్ రివర్స్ అయింది..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి