Viral Video: కుక్కే కదా తన్ని పడేద్దామనుకున్నాడు.. కానీ సీన్ రివర్స్ అయింది..

Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శునకానికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 07:12 PM IST
Viral Video: కుక్కే కదా తన్ని పడేద్దామనుకున్నాడు.. కానీ సీన్ రివర్స్ అయింది..

Viral Video: మనం ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలవడమంటే ఇదేనేమో. అన్యాయంగా ఎవరికైనా కీడు తలపెడితే... చివరకు మనకు అదే గతి పడుతోందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో (Social Media) జంతువులకు సంబంధించిన వీడియోలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాములు, కుక్కలు, పులులు తదితర యానిమేల్స్ (Animal Videos)కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ (Viral Video) అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

ఈ వీడియో ఓపెన్ చేస్తే...ఇందులో ఓ మనిషి నడుచుకుంటూ వచ్చి...బైక్ పక్కన నిలబడి ఉన్న కుక్కను తన్నడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో సీన్ రివర్స్ అవుతోంది. దురదృష్టవశాత్తు అతడే కాలుజారి పడతాడు. ఆ శునకానికి ఏమీ కాదు. ఇది సీసీటీవీ పుటేజీలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. కర్మ (Karma) సిద్దాంతాన్ని నమ్మనివారికి ఈ వీడియో ఒక ఉదాహరణ అనే చెప్పాలి. ఈ వీడియోను నేచర్‌హోలిక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 

Also Read: Heart Touching Video: ఎంత ప్రేమ.. ఎంత సహృదయత.. ఈ చిన్నారుల వీడియో చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News