Whats app New Feature: వాట్సప్‌పై కూడా మిస్టర్ ఇండియాలా మాయమైపోవచ్చు. క్షణాల్లో మీ పేరు, మీ స్టేటస్ మాయం చేసేయవచ్చు. ఈ అద్భుతమైన ట్రిక్ ఏంటనేది ఆశ్చర్యంగా ఉందా..రండి తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ మా జీ హిందూస్తాన్ రీడర్లకు ఓ అద్బుతమైన ట్రిక్ గురించి చెప్పబోతున్నాం. ఈ ట్రిక్ అనుసరిస్తే మీరు కూడా మిస్టర్ ఇండియాలో అనిల్ కపూర్‌లా మాయమైపోవచ్చు. అంటే మీ పేరు, మీ స్టేటస్‌ను వాట్సప్ నుంచి మాయం చేసేయవచ్చు. మీ ప్రైవసీని మార్చకుండా మీ పేరు మాత్రమే మాయం చేసే ట్రిక్ ఇది. 


సోషల్ మీడియా గురించి లేదా మెస్సెజింగ్ యాప్స్ గురించి చెప్పుకుంటే ముందుగా విన్పించే పేరు వాట్సప్ (Whatsapp) మాత్రమే. అంతలా ఆదరణ పొందిన యాప్ ఇది. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల ఫైవరైట్ వాట్సప్ చాలా కొత్త కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ అందుబాటులో తీసుకొస్తోంది. ఈ అప్‌డేట్స్ ద్వారా యూజర్లకు చాలా ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన ఫీచర్లు కూడా అందుబాటులో వస్తున్నాయి. ఇవాళ మేం మీకు చెప్పబోయే ఫీచర్ లేదా (Whatsapp New Feature) ట్రిక్ ద్వారా మీరు యాప్ నుంచి మాయమైపోవచ్చు. అదెలాగా తెలుసుకుందాం.


వాట్సప్ కొత్త ఫీచర్


వాట్సప్‌లో ఏ యూజర్ అయినా తమ పేరును ఫిల్ చేయకుండా బ్లాంక్‌గా ఉంచలేరు. మేం మీకు చెప్పబోయే ఫీచర్ లేదా ట్రిక్ ద్వారా మీరు ఆ బ్లాంక్‌గా ఉంచకుండానే..రాసింది కన్పించకుండా చేయవచ్చు. ఆ ట్రిక్ ద్వారా ఇన్విజిబుల్  ఇంక్ సహాయంతో మీరు మీ పేరును నిరభ్యంతరంగా రాయవచ్చు. దాంతో ఆ కాలమ్ ఫిల్ అవుతుంది. మీ పేరు కన్పించదు.


ఇదెలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోతున్నారా..ఇది ఇన్విజిబుల్ ఇంక్ ద్వారా సాధ్యమే. ఇన్విజిబుల్ ఇంక్‌తో (Invisible Ink) వాట్సప్‌పై మీరు పేరు రాసేందుకు మీ స్మార్ట్‌ఫోన్‌పై వాట్సప్ ఓపెన్ చేయాలి. స్క్రీన్‌పై అన్నింటికంటై ఎగువన ఉన్న మూడు డాట్స్ క్లిక్ చేయాలి. ఇందులో చివరి ఆప్షన్ సెటింగ్స్‌లో వెళ్లి..అక్కడ్నించి  (⇨ ,) ఇది కాపీ చేయాలి. మీ ప్రొఫైల్ ఫోటో కన్పించే చోట..క్లిక్ చేసి మీ పేరు ముందున్న పెన్సిల్ సింబల్‌పై క్లిక్ చేయాలి. కాలమ్‌లో మీ పేరు రాసి ఉన్నచోట..కాపీ చేసిన రెండు సింబల్స్‌ను పేస్ట్ చేయాలి. తరువాత ఏరో సింబల్ తొలగించి.. మీ పేరు సేవ్ చేసుకోవాలి. అంతే మీ పేరున్న కాలమ్ బ్లాంక్‌గా మారిపోతుంది. ఇలా మీ పేరు రాసి కూడా..కన్పించకుండా చేయవచ్చు.


Also read; Best Christmas Greetings: మీ స్నేహితులు, బంధువుల కోసం బెస్ట్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి