1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ ? ఏది నిజం ?
1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ చేస్తున్నారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియో మెసేజ్ నెటిజెన్స్‌ని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. కొంతమంది ఈ వైరల్ వీడియో నిజమేనని విశ్వసిస్తుండటంతో పాటు ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు.
1000 Notes Coming Back: సెంట్రల్ గవర్నమెంట్ మరోసారి నల్లధనాన్ని అదుపు చేసేందుకు నడుం బిగించిందా ? గతంలో రూ. 1000, రూ.500 నోట్లు రద్దు చేసి రూ. 2 వేల నోట్లు తీసుకొచ్చిన కేంద్రం.. తాజాగా మరోసారి రూ. 2 వేల నోట్లను రద్దు చేసి తిరిగి 1000 రూపాయల నోట్లను తీసుకురానుందా ? 2023 జనవరి 1 నుంచే ఈ మార్పు రానుందా ? ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్స్ మధ్య చర్చకొస్తున్న సందేహాలు ఇవి. ఇందుకు కారణం సోషల్ మీడియాలో ఒక మెస్సేజ్ వైరల్ అవుతుండటమే. ఆ వైరల్ మెసేజ్‌లో ఏం ఉందంటే.. 2023 జనవరి 1 నుంచి రూ. 2000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్రం 1000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టబోతోంది అని ఆ వైరల్ మెసేజులో ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వైరల్ వీడియో మెసేజ్ చూసిన జనంలో కొంతమంది అది నిజమేనని విశ్వసిస్తుండటంతో పాటు ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు. దీంతో ఈ విషయంపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ వైరల్ మెస్సేజ్‌లో నిజం లేదని స్పష్టంచేసిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం.. దయచేసి ఇలాంటి మెసేజులను ఇతరులకు ఫార్వార్డ్ చేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
అలాగే రూ. 2 వేల నోట్ల ముద్రణపైనా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య కొత్తగా 2000 రకం నోట్లను ముద్రించలేదనే విషయాన్ని ధృవీకరిస్తూ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులు సమాధానంలో పేర్కొంది.
పెరిగిపోతున్న 2 వేల రూపాయల ఫేక్ కరెన్సీ నోట్లు
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన 2 వేల రూపాయల కరెన్సీ నోట్లకు నకిలీ నోట్లు ముద్రించి మోసాలకు పాల్పడుతున్న ముఠాలు పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం 2016 లో 2 వేల ఫేక్ కరెన్సీ నోట్లు 2272 పట్టుబడగా.. 2020లో ఆ సంఖ్య 2,44,834 కి చేరడం గమనార్హం. ఆగస్టు 1న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.
ఇది కూడా చదవండి : Bullet Bike Caught Fire: తగలబడిన బుల్లెట్ బైక్.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి : Cockroach Found in Omelette: రైల్లో ఆహారం తింటున్నారా ? ఆమ్లెట్‌లో బొద్దింకపై ప్రధానికి ఫిర్యాదు
ఇది కూడా చదవండి : Vahan Puja For Helicopter: యాదాద్రిలో అరుదైన దృశ్యం.. హెలీక్యాప్టర్‌కి వాహన పూజలు, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook