Fake Currency in Hyderabad: నకిలీ నోట్ల చలామణి ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.నకిలీ నోట్ల దందా చేస్తున్న ఓ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దందాలో ప్రధాన సూత్రధారిగా ఉన్న షేక్ ఇమ్రాన్ (33) పరారీలో ఉండగా.. సయ్యద్ అన్సారీ (27), షేక్ ఇమ్రాన్ (33) అనే ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.2.5 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ నోట్ల దందాపై సమాచారం అందడంతో హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు, మీర్ చౌక్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంజీబీఎస్ సమీపంలో అన్సారీ, ఇమ్రాన్‌లను అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన శేఖర్ అనే వ్యక్తి నుంచి ఈ ఇద్దరు ఫేక్ కరెన్సీ కొనుగోలు చేసి మార్కెట్‌లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శేఖర్ కర్ణాటకలో జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తూ ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్నట్లుగా తేల్చారు.
శేఖర్ ఫేక్ కరెన్సీ నోట్లు ముద్రించాక తన బంధువైన సయ్యద్ అన్సారీకి సమాచారమిచ్చాడు. అన్సారీ నుంచి రూ.8 వేలు తీసుకుని.. అందుకు గాను రూ.50 వేల నకిలీ నోట్లు ఇచ్చాడు. అదే డబ్బును అన్సారీ రూ.15 వేలకు షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తికి విక్రయించబోయాడు. ఇంతలో పోలీసులకు దీనిపై సమాచారం అందడంతో హైదరాబాద్ ఎంజీబీఎస్ సమీపంలో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అన్సారీ, ఇమ్రాన్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దందా అసలు సూత్రధారి శేఖర్ పరారీలో ఉండటంతో ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read : CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. మంచి పనులు బీజేపీ నచ్చవన్న కేజ్రీవాల్
Also Read: Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook