Big King Cobra Drinking Water Video: భయంకరమైన కింగ్ కోబ్రాకు నీళ్లు తాగించిన వ్యక్తి.. ఈడు మగాడ్రా బుజ్జి!
King Cobra Drinking Water Video: కింగ్ కోబ్రాని చూస్తే హడలెత్తిపోతారు. అలాంటిది ఒక వ్యక్తి కింగ్ కోబ్రాకి నీళ్లు పట్టించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరే చూసేయండి మరీ!
King Cobra Drinking Water Video Got Viral: ఈ భూ ప్రపంచంలోని పాములు నీరు తాగుతాయా? లేదా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు తాగుతాయని, మరికొందరు తాగవని అంటుంటారు. అయితే కొన్ని ప్రత్యేక పండగల సందర్భాల్లో శ్వేత నాగు, నాగు పాములు పాలు తాగయని మనం వార్తల్లో చూస్తుంటాం.
అయితే ఇందుకు సంబందించిన వీడియోస్ మాత్రం చాలా అరుదుగా దర్శనమిస్తాయి. శ్వేత నాగు, నాగు పాము మాత్రమే కాదు ప్రమాదకరమైన కింగ్ కోబ్రా కూడా నీటిని త్రాగుతుంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అచ్చం మనిషి లాగే గడగడ నీళ్లు తాగేస్తుంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి మనుషులు ఓ అరగంట కూడా నీరు లేకుండా ఉండలేరు. పాములు కూడా వేడికి దాహంతో అలమటిస్తున్నాయి. ఓ పార్కులో కింగ్ కోబ్రా కూడా ఎండకు తాళలేకపోయింది. దాహంతో ఉన్న దానికి ఓ వ్యక్తి చిన్న పైప్ ద్వారా నీరు అందిస్తాడు.
Also Read: Ruturaj Gaikwad Fiance: జూన్ 3న పెళ్లి.. రుతురాజ్ గైక్వాడ్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా?
మొదట కాస్త భయపడిన కింగ్ కోబ్రా.. కొంత సమయం తర్వాత నీటిని తాగేస్తుంది. ఆ వ్యక్తి పైప్ అలానే పట్టుకుని ఉండగా.. అచ్చు మనిషి మాదిరే గుటకలు వేస్తుంది. దాహంతో ఉన్న వ్యక్తి ఎలా అయితే నీరు త్రాగుతాడో అచ్చు అలానే కింగ్ కోబ్రా నీటిని తాగుతుంది.
కింగ్ కోబ్రా గడగడ నీళ్లు తాగడంకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను '@ChandlersWildLife' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. లక్షల్లో వ్యూస్ ఈ వీడియోకి వచ్చాయి.
ఎండ తీవ్రతకు ఎవరూ అతీతులు కారు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కింగ్ కోబ్రా పరిస్థితి చూసి చలించిపోయా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. పాపం కింగ్ కోబ్రా, కింగ్ కోబ్రా ఇన్ని నీళ్లు తగ్గుతుందా? అంటూ కామెంట్స్ వర్షం కురుస్తుంది. ఈ వీడియోని మీరు చూసేయండి.
Also Read: WTC Final 2023: ఆస్ట్రేలియా వారిద్దరి గురించే ఆందోళన చెందుతోంది: రికీ పాంటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook