Ruturaj Gaikwad Fiancee: జూన్ 3న రుతురాజ్‌ గైక్వాడ్‌కు పెళ్లి.. గైక్వాడ్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా..?

Do you know about Ruturaj Gaikwad fiancy Utkarsha Pawar. టీమిండియా బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 2023 జూన్‌ 3న రుతురాజ్‌ వివాహం జరగనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 3, 2023, 02:59 PM IST
Ruturaj Gaikwad Fiancee: జూన్ 3న రుతురాజ్‌ గైక్వాడ్‌కు పెళ్లి.. గైక్వాడ్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా..?

Ruturaj Gaikwad to Marry Utkarsha Pawar on June 3rd: టీమిండియా బ్యాటర్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ స్టార్ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 2023 జూన్‌ 3న రుతురాజ్‌ వివాహం జరగనుంది. మహారాష్ట్రకు చెందిన ఉత్కర్ష పవార్‌తో రుతురాజ్‌ పెళ్లి జరగనుంది. కాగా ఐపీఎల్‌ 2023లో అదరగొట్టిన చెన్నై ఓపెనర్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (డబ్ల్యూటీసీ) 2023కి స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. పెళ్లి కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ భారత్ టీమ్ నుంచి అతడు తప్పుకున్నాడు.

పెళ్లి నేపథ్యంలో చివరి నిమిషంలో డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కి తాను ఆలస్యంగా వెళ్తానని బీసీసీఐకి రుతురాజ్‌ గైక్వాడ్‌ తెలిపినట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కాబట్టి రిస్క్ తీసుకోలేమని టీమిండియా హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భావించాడట. కోచ్ సూచన మేరకు రుతురాజ్‌ స్థానంలో ఐపీఎల్ 2023లో పరుగుల వరద పారించిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పటికే లండన్‌కు చేరుకున్న యశస్వి.. అక్కడ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడట. 

ఐపీఎల్ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ సందర్భంగా   చెన్నై ఆటగాళ్లంతా తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో మ్యాచ్‌ను చూసేందుకు హాజరయ్యారు. విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ ఎంఎస్ ధోనీతో అందరూ ఫొటోలు దిగారు. ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డేవన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, అజింక్య రహానె, దీపక్ చహర్‌ తమ సతీమణులతో కలిసి పోటీలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ తన తనకు కాబోయే సతీమణితో కలిసి సందడి చేశాడు. దీంతో ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మరో రెండు రోజుల్లో రుతురాజ్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఆమె ఎవరు? అని నెటిజన్లు సెర్చింగ్‌ మొదలుపెట్టారు.

Also Read: WTC Final 2023: ఆస్ట్రేలియా వారిద్దరి గురించే ఆందోళన చెందుతోంది: రికీ పాంటింగ్

రుతురాజ్‌ గైక్వాడ్‌కు కాబోయే సతీమణి పేరు ఉత్కర్ష పవార్‌. ఈ 24 ఏళ్ల యువతి మహారాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్‌ కూడా ఆడారు. ఉత్కర్ష మంచి ఆల్‌రౌండర్‌. అయితేఆమె గత 18 నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పుణెలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌ అండ్ ఫిట్‌నెస్‌ సైన్స్‌లో చదువుకుంటున్నారు. 1998 అక్టోబరు 13న ఉత్కర్ష పవార్‌ జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 24 ఏళ్లు. గతః కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెద్దల అంగీకారంతో ఒకటవుతున్నారట. 

Also Read: Cheapest Bike: డెడ్‌ ఛీప్‌ ధరలతో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌ ఇదే..లీటర్‌కు మైలేజీ ఎంతిస్తుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News