Little Kid Puzzle Solving Skills Videos: సాధారణంగా ఎవరైనా శాస్త్రీయంగా ఏదైనా గొప్ప ప్రతిభను కనబర్చినప్పుడు వారి చుట్టూ ఉన్న వాళ్లు వాళ్లను ఐన్‌స్టీన్ అని సంబోధించడం, లేదా ఐన్‌స్టీన్‌తో పోల్చడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఇది సర్వసాధారణంగా కనిపించే ట్రెండ్. ఏవైనా సాంకేతిక అంశాల్లో ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉన్న పిల్లలను లేదా ఏదైనా ఒక విషయంలో అత్యున్నత ప్రతిభ చూపించే పిల్లలను ఐన్‌స్టీన్ లాంటోడు అని సరదాగా ఆటపట్టించడం చూస్తుంటాం. ఇప్పుడు మేం చూపించబోయే వీడియో చూస్తే మీకు కూడా అలాంటి పిలుపే గుర్తుకొస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో కనిపిస్తున్న బుడ్డోడు కూడా చిన్న వయస్సులోనే పజిల్ సాల్వింగ్ స్కిల్స్ లో అత్యున్నత ప్రతిభ కనబర్చి వీక్షకుల చేత ఔరా అని అనిపించుకుంటున్నాడు. వివిధ రంగుల్లో ఉన్న కలర్ బ్లాక్స్‌ ని రంగుల వారిగా ఒక్క చోట అమర్చడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కలర్ పజిల్ సాల్వ్ చేసే సమయంలో పసికందు ముఖంలో ఎలాంటి టెన్షన్ కనిపించకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ మాత్రం వెనుకాడకుండా.. ఎక్కడా తడబడకుండా సునాయసంగా పజిల్ ని పూర్తి చేసిన తీరు చూసి నెటిజెన్స్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


ఫిగెన్ అనే ఎక్స్ హ్యాండిల్ నుండి ఐన్‌స్టీన్ బేబి అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపిస్తోంది. 



 


ఈ వీడియో చూసిన నెటిజెన్స్ తమదైన స్టైల్లో స్పందిస్తూ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. స్మార్ట్ కిడ్ అని కొంతమంది కామెంట్ చేస్తే.. వండర్ కిడ్ అని ఇంకొంతమంది కామెంట్స్ రాస్తున్నారు. ఇలాంటి పిల్లలకు శిక్షణ ఇస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారు అని మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. 


ఇది కూడా చదవండి : Common Krait Viral Video: ప్రాణాంతకమైన పామును పట్టిన ప్రముఖ స్నేక్ క్యాచర్.. వీడియోని చూస్తే ఆశ్చర్యపోతారు..


ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చిన్నారులకు సంబంధించి ఇలాంటి వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ వీడియోలకు భారీ ఆధరణ పెరిగిన నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల వీడియోలను షూట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. నెటిజెన్స్ ఆ వీడియోలను ఎగబడి మరీ చూస్తుండటంతో అవి అనతి కాలంలోనే వైరల్ అవుతున్నాయి. ఇంకొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలనే తమ చిన్నారులకు చూపించి వారికి పజిల్ సాల్వింగ్ లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వీడియోలు వైరల్ అవడానికి ఇది కూడా మరో కారణం అవుతోంది.


ఇది కూడా చదవండి : Dengue Fever: డెంగ్యూ ఫీవర్‌కి ఆయుర్వేద చిట్కాలు..ఈ రసంతో ఒంట్లో వైరస్ మాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి