Ayurvedic Home Remedies for Dengue Fever: ప్రస్తుతం వర్షాల కారణంగా వాతావరణంలోని తేమ పెరిగి దోమల బెడద పెరిగింది. దీంతో విష జ్వరాలి కూడా రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది డెంగ్యూ సంచారం కారణంగా ఆసుపత్రి పాలవుతున్నారు. డెంగ్యూ వైరస్ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రక్తంలోని ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాంతకంగా మారే ఛాన్సులు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈడెస్ అనే ఆడ దోమలు కారణంగా వ్యాపించే డెంగ్యూ వల్ల కండరాల నొప్పులు, వికారం, దద్దుర్లు, కళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డెంగ్యూ వ్యాధి కారణంగా చాలామందిలో చిగుళ్ల నుంచి రక్తం రావడం కూడా ప్రారంభమవుతుంది అయితే ఈ సమయంలో తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెంగీ వ్యాధితో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను ప్రతిరోజు పాటిస్తే సులభంగా ఉపశమనం పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారికి శరీరంలోని ప్రతి కండరం నొప్పి బారిన పడుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మెంతి ఆకులతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఇలా క్రమం తప్పకుండా మెంతి ఆకులతో తయారుచేసిన ఆహారాలు తీసుకుంటే శరీరంలోని నొప్పులన్నీ మాయమవుతాయి. అంతేకాకుండా మెంతి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టుకొని ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా కూడా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
డెంగ్యూ ఫీవర్ కారణంగా చాలామందిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి.. అయితే ఇలాంటి సమస్యతో బాధపడే వారికి వేపాకు ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద ని గుణాలు చెబుతున్నారు. వేపాకుతో తయారుచేసిన కషాయాన్ని ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరంలోని వైరస్ దూరమవుతుంది. అంతేకాకుండా రక్తంలోని ప్లేట్లెట్స్ ని పెంచేందుకు బొప్పాయి ఆకులు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. ఈ ఆకుల నుంచి తీసిన రసాన్ని రోజు ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి