Man Sleeping Under Running Truck: వేగంగా వెళ్తున్న ట్రక్కు కింద పడుకున్న వ్యక్తి అనే టైటిల్ చూసి కంగారు పడుతున్నారా ? వేగంగా వెళ్లే ట్రక్కు కింద పడుకోవడం సాధ్యమేనా ? ఒకవేళ పడుకున్నా.. ఆ పడుకున్న మనిషి బతుకుతాడా అనే కదా మీ సందేహం ? ఔను మీ సందేహం కూడా నిజమే. మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం ప్రయాణిస్తున్న ట్రక్కు కింద రిలాక్సుగా పడుకోవడానికి ఏకంగా ఓ మంచాన్నే ఏర్పాటు చేశాడు. ట్రక్కు కింద మంచం ఎలా పడుతుంది ? ఒకవేళ మంచం పట్టినా అది రన్నింగ్ ట్రక్కు కింద ఎలా సాధ్యమవుతుంది అని మళ్లీ సవాలక్ష సందేహాలు మీ బుర్రని తొలిచేయడం ఖాయం. అయితే ఈ సందేహాలన్నింటికి సమాధానమే ఇదిగో ఈ వీడియో. ఈ వీడియో చూస్తే అసలు సీన్ ఏంటో మీకే అర్థం అయిపోతుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


చూశారు కదా ఈ వీడియో.. ఆ వ్యక్తి తన ట్రక్కు కింది భాగంలో ఖాళీగా ఉన్న స్పేస్‌లో ఓ ఇనుప మంచాన్ని వెల్డింగ్ చేయించాడు. అందుకోసం బలమైన ఇనుప రాడ్లు ఉపయోగించినట్టు ఈ వీడియో చూస్తే స్పష్టం అవుతోంది.  


ట్రక్కు కూడా వేగంగానే వెళ్తున్నట్టు ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. ట్రక్కు వెళ్తున్న సమయంలోనే ఆ ట్రక్కు పక్క నుంచి బైక్ పై ఓవర్ టేక్ చేస్తూ వెళ్లిన వాళ్లు ఈ వీడియో షూట్ చేశారు. ఈ దేశీ జుగాడ్ చూసి ఈ వీడియో షూట్ చేసిన వాళ్లు ఇండియన్ కా టాలెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియో చూసిన నెటిజెన్స్ సైతం అవాక్కవుతున్నారు. కొంతమంది షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ప్రాణాలపై ఆశలు లేని వాళ్లే ఇలాంటి పని చేస్తారు అంటూ కొంతమంది నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తే.. ఇంత రిస్క్ తీసుకుని మరీ కునుకు తీయాల్సినంత అవసరం ఏముంది అని ఇంకొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. 


ఇది కూడా చదవండి : Drinking Beer or Alcohol ?: బయటికెళ్లి బీర్ తాగుతున్నారా ? ఇవి మర్చిపోవద్దు


నెటిజెన్స్ రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ... వాస్తవానికి ఇలాంటి పని చేయడం దుస్సాహసమే కాదు.. అవివేకం కూడా అవుతుంది. ఇది ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే వెల్డింగ్ చేసిన చోట క్రాక్స్ వచ్చి మంచం ఊడి కిందపడితే అతడి ప్రాణాలు క్షణాల్లోనే ట్రక్కు వెనుక టైర్ల కింద నలిగి గాల్లో కలిసిపోతాయి. ఒకవేళ అతడు నిద్రలో ఉండి పక్కకు దొర్లి కిందపడినా అదే జరుగుతుంది. అందుకే ఇలాంటి దుస్సాహాసాలు చేయకుండా ఉండటం బెటర్. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. 


ఇది కూడా చదవండి : Viral Video Today: ఎందుకు బ్రో ఈ ఎక్స్‌ట్రాలు.. దూల తీరిందా.. మెట్రోలో బెడిసికొట్టిన స్టంట్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి