Drinking Beer or Alcohol ?: బయటికెళ్లి బీర్ తాగుతున్నారా ? ఇవి మర్చిపోవద్దు

Drinking Beer or Alcohol ?: మద్యం తాగే అలవాటున్న మందు బాబులకు వీకెండ్ వచ్చినా లేదా ఏదైనా హాలీడే వచ్చినా జాలీగా ఫ్రెండ్స్ తో షికార్లు కొడుతూ బీర్ కొట్టడమో లేక వైన్ తాగుతూనో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇంట్లో తాగితే ఇంట్లో ఉన్న వాళ్లు ఒప్పుకోరు కనుక సాధ్యమైనంత వరకు బయట ఫ్రెండ్స్ కంపెనీ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఫ్రెండ్స్ రూమ్‌లోనో లేక బారులోనో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అలా ఫ్రెండ్స్‌తో లిక్కర్ పార్టీలు ఎంజాయ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడం పార్టీలో పాల్గొనే వారికి, వారి కుటుంబాలకు శ్రేయస్కరం.

  • Sep 20, 2023, 23:04 PM IST

Drinking Beer or Alcohol ?: ఇంతకీ అంతగా గుర్తుంచుకోవాల్సిన ఆ ముఖ్యమైన విషయాలు ఏంటనే కదా మీ సందేహం .. అయితే ఈ కింది అంశాలపై ఓ లుక్కేయండి.

1 /8

Drinking Beer or Alcohol ?: మోతాదుకు మించి మద్యం తాగితే ముందుగా మీరు మీ స్నేహితులతో ఎక్కువసేపు పార్టీ ఎంజాయ్ చేయలేరు. కొద్దిసేపటికే వికెట్ ఔట్ అయి పక్కన పడిపోవడమో లేదా పార్టీ ఎంజాయ్ చేసే మూడ్ లేకపోవడమో జరుగుతుంది. 

2 /8

Drinking Beer or Alcohol ?: మద్యం సేవించడంలో ఒక్కొక్కరికి ఒక్కో లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఏంటనేగి మద్యం సేవించే ప్రతీ ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. ఆ లిమిట్ దాటితే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కూర్చున్న చోటే ఆమ్లెట్ వేయడం, అక్కడి నుండి నిటారుగా లేచి ఒక్క అడుగు కూడా వేయలేకపోవడం.. లేదంటే బూతు పురాణం విప్పడం, ఇలా ఏవేవో దారుణాలు చూడాల్సి వస్తుంది.

3 /8

Drinking Beer or Alcohol ?: మద్యం తీసుకునేటప్పుడు చాలామందికి అదే పనిగా మద్యం తాగే అలవాటు ఉంటుంది. అందువల్ల వారి శరీరం డీహైడ్రేషన్ బారినపడటమే కాకుండా ఎక్కువ సమయం సరదాగా గడపకుండా త్వరగా డిచ్ అవుతారు. పార్టీ అంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయడమే కనుక ఈ విషయం మర్చిపోవద్దు.

4 /8

Drinking Beer or Alcohol ?: సరాదాగా బయటికి వెళ్లి స్నేహితులతో కలిసి మందు కొట్టి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మద్యం మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లడం బెటర్ లేదంటే ఎవరైనా తెలిసిన, మద్యం తాగని మిత్రుడి సహాయం తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ డ్రైవర్ వెంట ఉంటే ఇక అసలు రిస్కే లేదు. 

5 /8

Drinking Beer or Alcohol ?: మద్యం సేవించే క్రమంలో కొంతమంది ధ్యాసంతా తాగడంపైనే ఉంటుంది కానీ తినడం గురించి అస్సలే పట్టించుకోరు. అలా చేయడం వల్ల వారి ఆరోగ్యం త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. లేదంటే ఇంకొంతమంది అనారోగ్యానికి దారితీసే జంక్ ఫుడ్ ఏదేదో తింటుంటారు. ఇది కూడా అనారోగ్యమే. అలా కాకుండా మద్యం సేవించే క్రమంలోనే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలా చేయడం వల్ల ఉన్న మరో బెనిఫిట్ ఏంటంటే.. పొట్ట నిండుగా అనిపించడం వల్ల మద్యం అపరిమితంగా తాగకుండా ఉంటారు.

6 /8

Drinking Beer or Alcohol ?: మందు బాబులకు కొంతమందికి రెగ్యులర్ గా ఏ సరుకు తీసుకుంటారో ఆ సరుకే వారి ఒంటికి సూట్ అవుతుంది. అది కాకుండా మరో కొత్త బ్రాండ్ ట్రై చేసినా లేదా మరో కొత్త రకం తీసుకున్నా.. అది వారిపై సైడ్ ఎఫెక్ట్స్ చూపించి పార్టి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు.  

7 /8

Drinking Beer or Alcohol ?: మద్యం సేవించేటప్పుడు మత్తుగా అనిపించడం, ఒళ్లు తూలినట్టు అనిపిస్తే అక్కడికే బ్రేక్స్ వేయండి. ఆ స్టేజ్ దాటుకుని ముందుకు వెళ్లి వేసే ప్రతీ అడుగు ప్రమాదం వైపే ఉంటుంది. 

8 /8

Drinking Beer or Alcohol ?: లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఇదంతా ఇంటి నుండి బయటికి వెళ్లే తాగే వారికే కానీ ఇంట్లో ఉండి తాగే వారికి కాదా అనే సందేహం రావొచ్చేమో.. ఆరోగ్యం విషయంలో చెప్పిన విషయాలు, ప్రమాదాలను నివారించే విషయాలు ఎవరికైనా వర్తిస్తాయి అనే విషయం మర్చిపోవద్దు.