Viral Video Today: ఎందుకు బ్రో ఈ ఎక్స్‌ట్రాలు.. దూల తీరిందా.. మెట్రోలో బెడిసికొట్టిన స్టంట్..!

New Trending Video: మెట్రోలో స్టంట్ చేయబోయిన యువకుడు.. అందరి ముందు పరువు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు వీడియో తీసుకుని మరీ నవ్వులపాలయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 21, 2023, 08:08 AM IST
Viral Video Today: ఎందుకు బ్రో ఈ ఎక్స్‌ట్రాలు.. దూల తీరిందా.. మెట్రోలో బెడిసికొట్టిన స్టంట్..!

New Trending Video: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత ఏ ప్రయోగాలు చేసేందుకు అయినా రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో తమ టాలెంట్ చూపించే వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రయోగాలు ఒక్కోసారి వికటించి అందరి ముందు పరువు పోగొట్టుకుని నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి సంఘటనే ఓ మెట్రో రైల్లో జరిగింది. అందరి ముందు స్టంట్ చేయబోయిన ఓ యువకుడు.. అందరి ముందు పరువు పొగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు మెట్రో రైలు కోచ్‌లో నిలబడ్డాడు. తన ఫ్రెండ్‌కు ఫోన్ ఇచ్చి.. వీడియో తీయమని చెప్పాడు. పల్టీ కొట్టడానికి ముందుకు కింద కూర్చొన్నాడు. గాల్లో పల్టీలు కొట్టగా.. ల్యాండ్ సమయంలో దురదృష్టవశాత్తూ బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో ఊహించని విధంగా తల నేలను బలంగా తాకింది. ఈ సంఘటనలో రైలులో ఉన్న తోటి ప్రయాణీకులు షాక్‌కు గురయ్యారు. కొంతమంది తమ నవ్వులను ఆపుకోలేకపోయారు. మనోడు మాత్రం నొప్పితో తలను గట్టిగా పట్టుకుని పక్కకు వచ్చేశాడు. 

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by chaman flipper (@chaman_flipper)

@chaman_flipper హ్యాండిల్‌తో వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర చేశాడు. అప్పటి నుంచి ఈ వీడియోపై లైక్స్‌, కామెంట్ల వర్షం కురుస్తోంది. యువకుడి స్టంట్ చూసి తెగ నవ్వుకుంటున్నారు. నీకు ఇంతకు బుర్ర ఉందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ చేయడానికి మెట్రో సరైన స్థలం కాదని చెబుతున్నారు. "హహహ.. పిచ్చి బాగా ముదిరింది" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. స్టంట్ ఫెయిల్ అయినా.. అందరినీ నవ్వించారని మరికొందరు అంటున్నారు. "మెట్రోలో లేదా ఇతర ప్రజా రవాణాలో ఇటువంటి చర్యలకు పాల్పడడం చట్టవిరుద్ధం. దయచేసి జాగ్రత్తగా ఉండండి." అని ఓ నెటిజన్ హెచ్చరించారు. 

Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News