Viral News: వొడ్కా బాటిల్‌లో పూజా ఆయిల్.. వైరల్ అవుతోన్న ఫోటో..
Pooja oil in Vodka Bottle: సాగర్ అనే ఓ నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోని చూసి నెటిజన్లు నవ్వలేక చస్తున్నారు. మందు బాటిల్స్‌ని ఇలా కూడా ఉపయోగిస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు.
Pooja oil in Vodka Bottle: సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లులు కుటుంబాన్ని చాలా పద్దతిగా, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తారు. వృథా చేయడమంటే వారికి అస్సలు నచ్చదు. ఏదైనా వస్తువులు కొన్నప్పుడు.. వాటి ప్యాకింగ్‌తో వచ్చే డబ్బాలు, సీసాలను సైతం కిచెన్‌లో ఉపయోగిస్తుంటారు. అంతేనా.. అవసరమైతే ఇంట్లో మగవారు తాగి పడేసిన మందు బాటిల్స్‌ను సైతం భలే చక్కగా ఉపయోగించగలరు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ ఫోటోనే ఇందుకు నిదర్శనం.
సాగర్ అనే ఓ నెటిజన్ ఇటీవల తన ట్విట్టర్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో అన్ని పూజా సామాగ్రి కనిపిస్తున్నాయి. అయితే కాస్త పరీక్షగా చూస్తే... పూజా ఆయిల్ నింపిన బాటిల్‌పై 'అబ్జల్యూట్ వొడ్కా' అనే పదాన్ని గమనించవచ్చు. అంటే.. వొడ్కా బాటిల్‌లో పూజా ఆయిల్‌ని నింపారన్నమాట. ఇదే విషయాన్ని సాగర్ తన ట్వీట్‌లో పేర్కొంటూ.. 'డజను మంది హాజరైన పూజా కార్యక్రమంలో.. మా అమ్మ నన్ను ఇబ్బందిపడేలా చేసింది.' అని అన్నాడు.
సాగర్ షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అనవసరంగా అమ్మను నిందించడం ఎందుకు... పాపం.. ఆ బాటిల్‌పై రాసిన ఇంగ్లీష్ పదాలు ఆమెకు అర్థం కాక.. దాన్ని పూజా ఆయిల్ నింపేందుకు వాడేసి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌పై స్పందించిన సాగర్.. తానేమీ తన తల్లిని నిందించట్లేదని... తన అలవాట్ల గురించి ఆమెకు తెలుసునని.. ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా చేసిందని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సాగర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవడమే కాదు.. నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. నిజంగా తల్లులు దేన్ని వృథాగా పోనివ్వరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: China Plane Crash: బ్రేకింగ్ న్యూస్.. చైనా ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులు మృతి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook