మీరు ఆన్ లైన్ షాపింగ్ ( Online Shopping ) చేస్తారా.. ఒకటి బుక్ చేస్తే మరొక వస్తువు వచ్చిందా.. ఈ వ్యక్తికి కూడా అలాగే జరిగింది. తను బుక్ చేసినది కాకుండా మరోక వస్తువు రావడంతో ముందు షాక్ అయినా కానీ... తరువాత సంతోషపడ్డాడు. ఎగిరి గెంతులు వేస్తున్నాడు. కేరళకు ( Kerala ) చెందిన నబిల్ నషీద్ ఇటీవలే ఆన్ లైన్ లో ఒక పవర్ బ్యాంకు ( Power Bank ) ఆర్డర్  చేశాడు. దాని ధర సుమారు రూ.500 మాత్రమే ఉంటుంది. అయితే రెండు రోజుల తరువాత అతనికి ఒక ప్యాకేజీ అందింది. తెరచి చూస్తే షాక్ అయ్యాడు. ఎందుకంటే అందులో పవర్ బ్యాంకు లేదు. అందులో సుమారు రూ.8000 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ ఉంది.  In Pic: సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కొన్ని నిమిషాలు తెగ సంతోషపడ్డాడు. ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి చెప్పాడు. తరువాత సోషల్ మీడియాలో ( Social Media ) ఈ విషయం షేర్ చేసి.. ఇంత మంచి ఫోన్ నాకు లక్కీగా వచ్చింది.. అమేజాన్ ఇప్పడు ఏం చేయమంటారు ? ఫోన్ నేను నా వద్దే ఉంచేసుకోనా అని అడిగాడు. దీనికి అమెజాన్ ముందు ఒకటి కాకుండా మరోటి ప్యాక్ చేసినందుకు క్షమాపణ చెప్పి.. ఇక అది మీ ఫోనే అని తెలిపింది. ఈ లక్కీ మ్యాన్ ఇప్పుడు బాగా వైరల్ ( Viral )  అవుతున్నాడు. Island Photos: అలా ఐల్యాండ్స్ కి వెళ్లొద్దామా..