PUBG Indian Version: పబ్‌జి లవర్స్ కు గుడ్ న్యూస్! మళ్లీ ఎంట్రీ, అయితే చిన్న ఛేంజ్....
PUBG Mobile India: భారత దేశంలో పబ్‌జి గేమ్ కు మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే చైనాకు ( China) చెందిన టాన్సెంట్ దీనిని నిర్వహిస్తోండటంతో సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం ఈ గేమ్ ను బ్యాన్ చేసింది.
PUBG Corporation | భారతదేశంలో పబ్‌జి గేమ్ కు మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే చైనాకు ( China ) చెందిన టాన్సెంట్ దీనిని నిర్వహిస్తోండటంతో సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం ఈ గేమ్ ను బ్యాన్ చేసింది. అయితే నిజానికి పబ్‌జి చైనాకు చెందిన సంస్థ కాదు. అది దక్షిణ కొరియాకు చెందినది. భారత్ లో బ్యాన్ అవడంతో చైనా సంస్థతో తెగతెంపులు చేసుకుని మళ్లీ ఇండియాలోకి ప్రవేశించడానికి సిద్ధం అవుతోంది. అందులో భాగంగా గురువారం PUBG Mobile Indiaను లాంచ్ చేసింది PUBG కార్పోరేషన్ సంస్థ.
Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!
ఈ కొత్త వర్షన్ కు PUBG Mobile India అని పేరు పెట్టారు. భారతీయ ( India ) వినియోగదారుల కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. భారతీయుల రుచులకు అనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేశారు. అందులో భాగంగా పబ్‌జి క్యారెక్టర్స్ కు నిండుగా వస్త్రాలు ఉండేలా డిజైన్ చేశారు. గేమ్ యాప్ గురించి త్వరలో ఒక ప్రకటన చేస్తామని తెలిపింది సంస్థ.
చైనా సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఇక తమకు లేవు అని తెలిపింది. అదే విధంగా ప్రైవసీ పరంగా, సెక్యూరిటీ పరంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపింది.
సౌత్ కొరియాలోని క్రాఫ్ట్ర్ కంపెనీలో పబ్‌జి కార్పోరేషన్ ఒక భాగం. ఈ సంస్థ భారత దేశంలో లోకల్ వీడియో గేమింగ్, ఎంటర్ టైన్మెంట్, ఐటీ పరిశ్రమల్లో సుమారు రూ.100 మిలియన్ల పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. భారత్ లో దాని కార్యాలయం స్థాపించి అందులో సుమారు 100 మందికి ఉపాధి కల్పించనున్నారట. ఇందులో వ్యాపారం, ఈస్పోర్ట్స్, గేమ్ డెవెలెప్మెంట్ లో ట్యాలెంట్ ఉన్నవారికి ప్రోత్సాహిస్తాం అని తెలిపింది.
ALSO READ| NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం
ALSO READ| WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR