Rakesh Jhunjhunwala Dance Video: షేర్ మార్కెట్ దిగ్గజ పెట్టుబడిదారుడైన రాకేష్ ఝుంఝున్‌వాలా గుండెపోటుతో ఇవాళ మరణించారు. మరోవైపు ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో తెగ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాకేష్ ఝుంఝన్‌వాలా. షేర్ మార్కెట్‌లో ఓ సంచలనం.  హర్షద్ మెహతాకు సమకాలీకుడు. దిగ్గజ షేర్ మార్కెట్ నిపుణుడైన రాకేష్ ఝుంఝున్‌వాలా అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడు. 62 ఏళ్ల రాకేష్ ఝుంఝున్ వాలా సంపద 46 వేల కోట్ల రూపాయలు. ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. రాకేష్ ఝుంఝున్‌వాలా మరణవార్త విని వివిధ రంగాల సెలెబ్రిటీలు నివాళులర్పించారు. మరోవైపు రాకేష్ ఝుంఝున్‌వాలాకు చెందిన ఓ పాత వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. 


దాదాపు రెండున్నర నిమిషాలున్న ఈ వీడియోలో రాకేష్ ఝుంఝున్‌వాలా ఓ వీల్‌ఛైర్‌పై కూర్చుని ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ విన్పించగానే..ఒక్కసారిగా జోష్‌లోకి వచ్చేశారు. 21 ఏళ్ల కుర్రోడిలా వీల్‌ఛైర్‌పై కూర్చునే..యాక్టివ్ అయిపోయారు. ఆనందంతో మ్యూజిక్‌కు తగ్గట్టుగా కాళ్లు చేతులే కాదు..ఒళ్లంతా ఊపడం మొదలెట్టారు. సంగీతానికి తగ్గట్టు తాళాలేయడం మరో విశేషంగా చెప్పవచ్చు. 


రాకేష్ ఝుంఝున్‌వాలాను అంతగా ఆకర్షించిన ఆ పాట మేరా చైన్ వైన్ సబ్ ఉజ్డా పాట. ఈ పాట వింటూనే అంతటి వ్యాపారవేత్త డ్యాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రెండున్నర నిమిషాల ఈ వీడియోలో మొత్తం డ్యాన్స్ వేస్తూ చాలా హుషారుగా కన్పించారు. అంతేకాదు..భుజంపై ఉన్న శాలువాను తలపై చెంగులా కప్పుకుని మరీ డ్యాన్స్ స్టెప్పులేశారు. 


వీల్‌ఛైర్‌పై డ్యాన్స్ చేస్తున్న రాకేష్ ఝుంఝున్ వాలా వీడియోను సంజయ్ నిరుపన్ ట్విట్టర్‌లో షేర్ చేయగానే వైరల్ కాసాగింది. ఇప్పటికే 2 లక్షలకు పైగా వీక్షించారు. రాకేష్ ఝుంఝున్‌వాలా రెండు కిడ్నీలు పాడైపోయాయని..డయాలసిస్‌పై ఉన్నారని..అయినా అతని ఈ వీడియో మృత్యువునే సవాలు చేస్తుందని..జీవితాన్ని జీవించే కసి ఉండాలని వీడియో షేర్ చేస్తూ..సంజయ్ నిరుపన్ వ్యాఖ్యానించాడు.



రాకేష్ ఝుంఝున్‌వాలా ఇటీవలే కొన్నిరోజుల క్రితం ఆకాష్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించారు. ఇవాళ ఉదయం గుండెపోటు రాగానే..ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు పోయాయి. రాకేష్ ఝుంఝున్‌వాలా గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 


Also read: Cobra Viral Video: నీ ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్ బాసూ.. అంత పెద్ద పామును సునాయాసంగా పట్టుకున్నాడుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook