Cobra Viral Video: నీ ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్ బాసూ.. అంత పెద్ద పామును సునాయాసంగా పట్టుకున్నాడుగా!

Man playing with big Cobra and caught easy. ఓ వ్యక్తి మాత్రం కళ్లముందు భారీ కింగ్ కోబ్రా  ఉన్నా.. అస్సలు భయపడలేదు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 14, 2022, 02:36 PM IST
  • నీ ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్ బాసూ
  • పెద్ద పామును సునాయాసంగా పట్టుకున్నాడుగా
  • 10 అడుగుల పొడవున్న నాగు పాము
Cobra Viral Video: నీ ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్ బాసూ.. అంత పెద్ద పామును సునాయాసంగా పట్టుకున్నాడుగా!

Man playing with big Cobra and caught easily in Forest: సాధారణంగా మనం చిన్న పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తి భయంతో వణికిపోతాం. ఇంకాస్త పెద్ద పాము కనబడితే ఎమన్నా ఉందా.. వెన్నులో వణుకు పుట్టి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం కళ్లముందు భారీ కింగ్ కోబ్రా (King Cobra) ఉన్నా.. అస్సలు భయపడలేదు. అది చాలా ప్రమాదకరమే కాకుండా అత్యంత విషపూరితమైనదని తెలిసినా.. ఒట్టి చేతులతో సునాయాసంగా పట్టేశాడు.ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. 

ఒక వ్యక్తి 8-10 అడుగుల పొడవున్న నాగు పాముతో ఎలా ఆడుకుంటున్నాడో వీడియోలో చూడొచ్చు. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఈ ఘటన ఆఫ్రికా దేశాలలో చోటుచేసుకున్నట్లు అర్ధమవుతోంది. అడవిలో ఒక వ్యక్తి 10 అడుగుల పొడవున్న నాగు పాము తోకను పట్టుకుంటాడు. నెమ్మదిగా దాని నడుము భాగాన్ని పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేయగా.. అది అతడిని కాటు వేయడానికి దూసుకొస్తోంది. కింద పడిన వెంటనే మరోసారి అతడి పైకి దూసుకొస్తోంది. అయినా కూడా ఆ వ్యక్తి దాని తోకను మాత్రం వదలడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎర్త్‌పిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. మరోవైపు వేలల్లో కామెంట్స్ వచ్చాయి. హ్యాట్సాఫ్ భయ్యో, నీ ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్ బాసూ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓసారి వీడియో చుడండి.

Also Read: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు కావాలా.. పూర్తి డీటెయిల్స్ ఇవే!

Also Read: Fish Oil: ఫిష్ ఆయిల్‌ని వినియోగించడం వల్ల కాలేయ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 
 

Trending News