12 feet mountain snake halchal anakapalle video viral: ప్రాణం మీద తీపి ఉన్నవారు ఎవరైన పామును చూసి భయంతో పారిపోతుంటారు. పాము తోక.. అక్కడ కన్పిస్తే.. ఇక్కడ నుంచి ఇటే జంప్ అయిపోతుంటారు. ఇక మరికొందరు మాత్రం.. పామేంటీ.. దానికి భయపడేది ఏంటన్నట్లు ఉంటారు. కానీ ఇలాంటి పనులు చేసే వాళ్లు కొన్నిసార్లు తమ లైఫ్ లో చిక్కుల్లో వేసుకుంటారు. సాధారణంగా తెలివైన వారు మాత్రం పాములు కన్పిస్తే.. మాత్రందానికి అపకారం తలపెట్టకుండా, స్నేక్ సోసైటీవాళ్లకు సమాచారం ఇస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకంటే.. పాములకు అపకారం తలపెడితే.. కాలసర్పదోషాలు చుట్టుకుంటాయి. ఈ క్రమంలో పాముల వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. నెటిజన్లు సైతం.. పాముల వెరైటీ వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని భయకంగా ఉంటాయి. ఈ క్రమంలో పాములు.. అడవులు, పొలాలు ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి.


పాములల్లో గిరినాగు చాలా డెంజర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం 12 అడుగులు భారీ గిరినాగు ఏపీలోని అనాకాపల్లిలో హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 


పూర్తి వివరాలు..


ఏపీలోని అనకాపల్లి జిల్లా  మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు రచ్చ చేసింది. అక్కడి రైతు.. తన పనుల్ని చేసుకుని... గట్టు మీదకు వెళ్లి కూర్చున్నాడు. ఏదో వెరైటీగా అలజడి వస్తుండటంతో పొదల దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ భారీ గిరినాగు కన్పించింది. అది రక్త పింజరను అప్పటికే మింగేయడం అతను చూశాడంట. దీంతో మెల్లగా అక్కడి నుంచి పక్కకు వచ్చి.. పాములను పట్టే వాళ్లకు సమాచారం ఇచ్చాడు.


వెంటనే అక్కడకు చేరుకున్న స్నేక్ సొసైటీ వాళ్లు గిరినాగు చూసి ఆశ్చర్యపోయారు. అది దాదాపు.. 12 అడుగుల పెద్దదిగా ఉంది. స్నేక్ మెన్ ఎంతో చాకచక్యంగా గిరినాగును పట్టుకున్నారు. కానీ అది మాత్రం.. వారి నుంచి తప్పించుకునేందుకు బాగా ప్రయత్నించినట్లు తెలుస్తొంది.


Read more: Shamshabad Airport: వామ్మో.. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో డెంజరస్ పాములు.. మరీ అక్కడ పెట్టి.. వీడియో ఇదిగో..


కానీ అతను మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా గిరినాగును బంధించి.. దగ్గరలోని దట్టమైన అడవుల్లోకి వదిలేసినట్లు తెలుస్తొంది. అక్కడి రైతులు.. ఇంత పెద్ద గిరినాగును తాము ఎప్పుడు చూడలేదని కూడా చెప్పినట్లు తెలుస్తొంది. మొత్తానికి ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.