Flight Stuck Under Bridge: ఏపీలో రోడ్డుపై బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. వీడియో వైరల్
Flight Stuck Under Bridge: విమానాన్ని తరలిస్తున్న భారీ ట్రక్కు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కొరిసపాడు అండర్‌పాస్ వద్ద విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కోవడంతో ట్రక్కు అక్కడే ఆగిపోయింది. నడిరోడ్డుపై విమానం కనిపించడంతో ఈ అసాధారమైన సీన్ చూడ్డానికి జనం ఎగబడ్డారు.
Flight Stuck Under Bridge: ఎయిర్ ఇండియాకు చెందిన విమానాన్ని స్క్రాప్ వేలంలో భాగంగా కొనుగోలు చేసిన హైదరాబాద్ హోటల్ బిజినెస్ మేన్.. ఆ విమానాన్ని రోడ్డు మార్గంలో కేరళలోని త్రివేండ్రం నుండి హైదరాబాద్ కి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఓ భారీ ట్రక్కుపై విమానాన్ని ఎక్కించి దానిని హైదరాబాద్ తరలిస్తున్నారు. సరిగ్గా మూడు రోజుల కిందట ఈ విమానం గురించి మనం మన వెబ్ సైట్ లో ఒక కథనం ప్రచురించడం చూసే ఉంటారు. కేరళలోని కొల్లాం జిల్లాలో ఈ భారీ ట్రక్కు ఓ బ్రిడ్జిని దాటే సమయంలో అధిక సమయం పట్టడంతో అది భారీ ట్రాఫిక్ జామ్ కి కారణమైంది. దీంతో స్థానికులు, ప్రత్యక్షసాక్షులు ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలతో హంగామా చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత చేకూరింది.
తాజాగా ఇదే విమానాన్ని తరలిస్తున్న భారీ ట్రక్కు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చేరుకుంది. బాపట్ల జిల్లాలోని కొరిసపాడు అండర్‌పాస్ వద్ద విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కోవడంతో ట్రక్కు అక్కడే ఆగిపోయింది. నడిరోడ్డుపై విమానం కనిపించడంతో ఈ అసాధారమైన సీన్ చూడ్డానికి జనం ఎగబడ్డారు. సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ స్టేటస్‌లతో హంగామా చేయడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అద్దంకి - హైదరాబాద్ సర్వీస్ రోడ్డుపై మేదరమెట్ల వద్ద మరమ్మతులు జరుగుతుండటంతో అధికారులు అటుగా వెళ్లే వాహనాలను కొరిసపాడు అండర్ పాస్ మార్గంలో మళ్లించారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. కొరిసపాడు అండర్ పాస్ వద్ద విమానం తీసుకెళ్తున్న ట్రక్కు నిలిచిపోయిందని సమాచారం అందుకున్న మేదరమెట్ల పోలీసులు హుటాహుటిన విమానాన్ని అండర్ పాస్ కింది నుంచి సురక్షితంగా వెలికి తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
విమానంపై పిస్తా హౌజ్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉండటం గమనిస్తోంటే.. ఈ విమానాన్ని హైదరాబాద్ కి చెందిన పిస్తా హౌజ్ రెస్టారెంట్ యజమాని శివ శంకర్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఫ్లైట్ థీమ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం కోసమే ఈ విమానాన్ని కొనుగోలు చేసినట్టు మనం గతంలోనే చెప్పుకున్న విషయం తెలిసిందే.
ఎయిర్ ఇండియాకు 25 ఏళ్ల పాటు విమానయానం సేవలు అందించిన ఈ విమానం.. ఫిట్‌నెస్ అండ్ సర్వీస్ పరంగా ఎక్స్‌పైరీ అవడంతో ఎయిర్ ఇండియా సంస్థ ఈ విమానాన్ని స్క్రాప్ కింద వేలం వేసింది. ఎయిర్ ఇండియా వేలంలో పిస్తా హౌజ్ యజమాని ఈ విమానాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రపంచం నలుమూలలా ఫ్లైట్ థీమ్ రెస్టారెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై హైదరాబాద్ లోనూ మనం ఎరోప్లేన్ థీమ్ రెస్టారెంట్ చూడొచ్చన్నమాట. అన్నింటికిమించి ఈ విమానం హైదరాబాద్‌కి రాకముందే ఈ విధంగా సోషల్ మీడియాలో తగిన రీతిలో పాపులారిటీని కొట్టేసింది. త్రివేండ్రం నుంచి హైదరాబాద్‌కి రోడ్డు మార్గంలో వస్తోన్న ఈ విమానం ( Flight on Road Video ) ఎక్కడున్నా.. అక్కడ జనం అందరికీ తగినంత వినోదాన్ని పంచుతోంది. ప్రస్తుతం ఈ విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Business Ideas: 2 నెలల కోర్సు చేసి ఏడాదికి 18 లక్షలు సంపాదిస్తున్నాడు
Also Read : SBI Custmoers Alert: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. మీకూ ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook