Twitter: ఆ కొద్ది సేపు ట్విట్టర్ యూజర్లు పండగ చేసుకున్నారు
ట్విట్టర్ ( Twitter ) వినియోగదారులు చాలా కాలం నుంచి కోరుతున్నది వారికి దక్కింది. కొద్ది సేపటికే అయినా ట్విట్టర్ యూజర్లు తము పోస్ట్ చేసిన కంటెంట్ ను ట్వీట్ చేయగలిగారు.
ట్విట్టర్ ( Twitter ) వినియోగదారులు చాలా కాలం నుంచి కోరుతున్నది వారికి దక్కింది. కొద్ది సేపటికే అయినా ట్విట్టర్ యూజర్లు తము పోస్ట్ చేసిన కంటెంట్ ను ట్వీట్ చేయగలిగారు. ట్వీట్ చేసిన తరువాత అందులో ఏదైనా పొరపాటు లేదా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే దాన్ని ఎడిట్ చేయడం అసాధ్యం.
చాలా మంది తమ పాట ట్వీట్ డిలీట్ చేసి వెంటనే మరో ట్వీట్ చేసే వాళ్లు. ఇలా తమ తప్పును ఫిక్స్ చేసేవాళ్లు. అయితే ట్విట్టర్ లో ఈ కష్టం ఇకపై తొలగిపోనుంది అని అనిపిస్తోంది.
ఒకరికి రిప్లై ఇచ్చే సమయంలో మీరు పొరపాటున ఏదైనా తప్పుగా టైప్ చేసి ఉంటే వెంటనే మీరు దాన్ని డిలీట్ చేస్తారు. ఇలా ఎడిట్ చేసిన కంటెంట్ ను తెరిస్తే అక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపించింది అని ది వెర్జ్ కు చెందిన టామ్ వారెన్ ( The Verge ) తెలిపారు.
అయితే దీన్ని ట్రై చేసిన ఒక యూజర్ ఇది అద్భుతంగా పని చేసింది అంటున్నారు. రిప్లై తప్పుగా వచ్చింది అని డిలీట్ చేసి.. మళ్లీ రిప్లై ఇవ్వాలి అని రిప్లై ఆప్షన్ క్లిక్ చేస్తే.. పాత డిలీట్ అయిన కంటెంట్ ఎడిట్ చేసే ఆప్షన్ కనిపించిందట. అరే ఎడిట్ ఆప్షన్ వచ్చిందా అని సంతోషించారట యూజర్.
అయితే ఈ వార్తపై ట్విట్టర్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. మేము ఇలాంటి టెస్ట్ చేయడం లేదు. ఇది కేవలం ఒక బగ్ వల్ల మాత్రమే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. దీన్ని వెంటనే ఫిక్స్ చేస్తాము అని తెలిపారు.
ట్విట్టర్ సీఈఓ (Twitter CEO ) కూడా ఎడిట్ ఆప్షన్ ఎప్పడూ రాదు అని చెప్పేసరికి ట్విట్టర్ యూజర్లు కాస్త నిరాశ చెందినా.. కొద్ది సమయం కోసం అయినా తము కోరుకున్నది దక్కింది అని సంతోషపడ్డారు.