Viral Video: మిణుగురు పురుగుని మింగిన కప్ప.. ఎలా వెలుగుతోందో చూడండి

క్యారెట్లు తింటే కళ్లు మెరుస్తాయి.. బీట్ రూట్ తింటే చర్మం మెరుస్తుంది అంటారు. ఈ మాటలను సీరియస్ గా తీసుకుందో ఏమో తెలియదు కానీ.. ఒక కప్ప మాత్రం డైరక్ట్ గా మిణుగురు ( Firefly ) పురుగును తినేసింది.

Last Updated : Sep 14, 2020, 03:25 PM IST
    • క్యారెట్లు తింటే కళ్లు మెరుస్తాయి.. బీట్ రూట్ తింటే చర్మం మెరుస్తుంది అంటారు.
    • ఈ మాటలను సీరియస్ గా తీసుకుందో ఏమో తెలియదు కానీ.. ఒక కప్ప మాత్రం డైరక్ట్ గా మిణుగురు ( Firefly ) పురుగును తినేసింది.
    • అలా మిణుగురు పురుగును ఆరగించిన కప్పకి ( Frog) ఒక చిక్కు వచ్చి పడింది. అది ఎక్కడికి వెళ్లినా దాంతో పాటు ఒక మెరుపు కనిపిస్తోంది.
Viral Video: మిణుగురు పురుగుని మింగిన కప్ప.. ఎలా వెలుగుతోందో చూడండి

క్యారెట్లు తింటే కళ్లు మెరుస్తాయి.. బీట్ రూట్ తింటే చర్మం మెరుస్తుంది అంటారు. ఈ మాటలను సీరియస్ గా తీసుకుందో ఏమో తెలియదు కానీ.. ఒక కప్ప మాత్రం డైరక్ట్ గా మిణుగురు ( Firefly ) పురుగును తినేసింది. అలా మిణుగురు పురుగును ఆరగించిన కప్పకి ( Frog) ఒక చిక్కు వచ్చి పడింది. అది ఎక్కడికి వెళ్లినా దాంతో పాటు ఒక మెరుపు కనిపిస్తోంది.

ఇదంతా తన పొట్టలో ఉన్న మిణుగురు మహత్యమే అని దానికి అర్థం అయ్యిందే లేదో కానీ.. దానికి సంబంధించిన వీడియో ( Viral Video ) మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొడుతోంది.

కప్ప శరీరంలో ఏదో లైట్ బిగించినట్టు మెరుపు వస్తోంది. దీనికి కారణం దాని కడుపులో ఉన్న మిణుగురు పురుగే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కప్ప కడుపులో అప్పటికీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న మిణుగురు..కప్పకి ఏదో కొత్త వెలుగును ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నెటిజెన్లు ( Netizens ) మాత్రం ఈ వీడియోను చూసి కప్ప జీవితంలో సరికొత్త వెలుగు వస్తోంది అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Trending News