Valentines Day Special: సంవత్సరంలో ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమ విషయాలే ఉంటాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రోజుకో విశేషం ఉంటాయి. ఈ సందర్భంగాకు ప్రేమకు సంబంధించిన ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ యువతి తన ప్రేమ విషయాన్ని తల్లితో చెప్పగా ఆమెకు తన ప్రియుడు నచ్చేశాడు. ఇదే విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పగా అతడు స్పందించిన విధానం చూస్తే నవ్వాపుకోలేరు. అంతలా తిరిగి సమాధానం ఇచ్చాడు. ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Crazy Theft: దొంగ ఇంట్లో ఫారెన్‌ మందు కనిపించగానే ఫుల్‌ చిల్లయిన దొంగలు.. తెల్లారి ఏం జరిగిందంటే?


తమ ప్రేమ విషయాన్ని తల్లికి చెప్పినట్లు తన బాయ్‌ఫ్రెండ్‌కు వివరించింది. 'రాహుల్‌ నువ్వు మా అమ్మకు నచ్చావు' అని యువతి వాట్సాప్‌లో తన ప్రియుడికి పంపింది. నిమిషం తరువాత చూసుకున్న అబ్బాయి వేరేలా అర్థం చేసుకుని ఆమెకు అదిరిపోయే రిప్లయి ఇచ్చాడు. 'ఆంటీకి వద్దని చెప్పు రియా. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా' అని సందేశం పంపాడు. రాహుల్‌ రిప్లైకి రియా దిమ్మతిరిగే ఉంటది. దెబ్బకు వారి మధ్య బ్రేకప్‌ పడి ఉంటదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రియా, రాహుల్‌ మధ్య వాట్సాప్‌ చాటింగ్‌కు సంబంధించిన ఫొటోను దర్శన్‌ అనే నెటిజన్‌ 'ఎక్స్‌'లో పోస్టు చేశాడు.

Also Read: RRB Technician Jobs: రైల్వే శాఖ మరో భారీ ఉద్యోగ ప్రకటన.. 9 వేల ఉద్యోగాలకు అర్హతలు, ఫీజు వివరాలు ఇదిగో..


అమ్మాయి చెప్పింది ఒకటైతే అబ్బాయి అర్థం చేసుకున్నది మరోటి. 'నువ్వు బాగా నచ్చావు. మన పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని రియా చెప్పింది. మనోడు మాత్రం 'తల్లికి నచ్చడంతో ఆమె ఎక్కడా పెళ్లి చేసుకుంటుందో' అని భావించాడు. ఇది సరదాగానే లేదా వాస్తవంగా జరిగిందా తెలియడం లేదు. కానీ వాట్సాప్‌ చాటింగ్‌ మాత్రం వైరల్‌గా మారింది. నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. 'రాహుల్‌ సిన్సియర్‌ ప్రేమికుడు. బిడ్డను మాత్రమే చేసుకుంటాడు' అని ఒకరు స్పందిస్తే.. 'ఏం నాయనా నీకు తల్లీబిడ్డ ఇద్దరూ కావాల్నా?' అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.


ప్రేమికుల దినోత్సవం సమీపిస్తున్న సమయంలో రాహుల్ ఇచ్చిన రిప్లయ్‌తో రియా బ్రేకప్‌ చెప్పి ఉంటుందని మరికొందరు ఊహించుకుంటున్నారు. రియా, రాహుల్‌ ప్రేమ ఏమైంది? తర్వాత ఏం జరిగిందని నెటిజన్లు అడుగుతున్నారు. రాహుల్‌ సమాధానానికి రియా ఎలా స్పందించింది? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ వాట్సాప్‌ చాటింగ్‌ ఫేక్‌ అని, ఎవరో కావాలని అలా సృష్టించి ఉంటారని టెక్‌ ఉద్యోగులు చెబుతున్నారు. వాస్తవమో.. కాదో నవ్వుకోవడానికి ఇది బాగుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook