Crazy Theft Incident: ఓ ఎన్నారై నివాసంలో దొంగతనానికి పాల్పడిన దొంగలు మంచిగా ఎంజాయ్ చేశారు. దొంగతనానికి వెళ్లిన ఇంట్లో ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లు కనిపించడంతో ఆగలేకపోయారు. పబ్, బార్‌కు వెళ్లినట్టు దొంగతనానికి వెళ్లిన ఇంట్లో దొంగలు ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉన్న డ్రైఫ్రూట్స్ తీసుకుని మందులోకి మంచింగ్ వేసుకున్నారు. మద్యం మత్తులో నిద్రపోయారు. తెల్లవారుజామున ఇంట్లో బంగారు ఆభరణాలు, నగలు చోరీ చేసుకుని ఉడాయించారు. అయితే వారు మద్యం మత్తులో తూలుతూ వెళ్తుండగా శబ్ధం రావడంతో స్థానికులు మేల్కొని వారిని చూశారు. వెంబడించగా వారు తమ చెప్పులు, టవళ్లు వదిలేసి పరుగులు పెట్టారు.ఈ సంఘటన తెలంగాణలోని హన్మకొండలో చోటుచేసుకుంది.
Also Read: Honey Trap: సింగోటం హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. ఇది తల్లీకూతురు నడిపే 'క్రైమ్ కథా చిత్రం'
వరంగల్ జిల్లా బాలసముద్రం గ్రామానికి చెందిన కనపర్తి సత్యనారాయణ ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. ఆయన హన్మకొండ చౌరస్తా ప్రాంతంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఇంటి తాళం వేసి సత్యనారాయణ అమెరికాకు వెళ్లారు. ఇంటికి తాళం ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు ఈనెల 10 వ తేదీన ఆ ఇంటి దొంగతనం చేసేందుకు నలుగురు దొంగలు వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లోకి దూరారు. ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లోపలకు వెళ్లారు.
Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్ క్రికెటర్
ఇంటి లోపలికి వెళ్లి ఎక్కడెక్కడ విలువైన వస్తువులు ఉన్నాయని పరిశీలించారు. పూజ గదిలో ఉన్న వెండీ పూజా సామగ్రిని సంచుల్లో వేసుకున్నారు. బీరువాలో ఉన్న రూ.30 వేల నగదును తస్కరించారు. ఇంకా ఇంట్లో వెతుకుతుండగా ఖరీదైన విదేశీ మద్యం సీసాలు కనిపించాయి. చూడగానే నోరూరింది. అనంతరం ఫ్రిజ్ తెరచి చూడగా డ్రైఫ్రూట్స్ కనిపించడంతో వాటిని తీసుకున్నారు. ఇక నలుగురు కలిసి తాపీగా తాగారు. మాంచి స్టప్ మంచి మందుతో ఫుల్ పార్టీ చేసుకున్నారు. రెండు బాటిళ్లు ఖాళీ చేశారు. అనంతరం ఇంట్లో కొద్దిసేపు నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రలేచి మెల్లగా జారుకుంటుండగా అప్పటికే మెలకువతో ఉన్న స్థానికులు వారిని చూసి 'దొంగ దొంగ' అని అరిచారు.
స్థానికుల కేకలతో దొంగలు పరారయ్యారు. పరుగెత్తడానికి ఇబ్బందిగా ఉందని తమ చెప్పులు, బూట్లు, టవళ్లు వదిలేసి పరుగులు పెట్టారు. అనంతరం చుట్టుపక్కల వారు ఇంటి యజమాని సత్యనారాయణకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఈ సంఘటనపై సత్యనారాయణ సోదరుడు కిషన్ రావు వచ్చి ఇంటిని పరిశీలించారు. వెంటనే సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించారు. దొంగల ఆనవాళ్లు పరిశీలించి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఈ దొంగతనం వార్త వరంగల్ జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దొంగతనంతోపాటు మంచి పార్టీ చేసుకుని వెళ్లిన దొంగల తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook