RRB Technician Jobs: రైల్వే శాఖ మరో భారీ ఉద్యోగ ప్రకటన.. ఎన్ని పోస్టులు? అర్హతలు, ఫీజు వివరాలు ఇదిగో..

RRB Technician 2024 Notification: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 9 వేల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలు, ఫీజు తదితర వివరాలు ఇలా..

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 12, 2024, 07:01 PM IST
RRB Technician Jobs: రైల్వే శాఖ మరో భారీ ఉద్యోగ ప్రకటన.. ఎన్ని పోస్టులు? అర్హతలు, ఫీజు వివరాలు ఇదిగో..

RRB Technician Recruitment 2024: రైల్వే శాఖ మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. 9 వేల ఉద్యోగాలతో తాజాగా ఉద్యోగాలు రైల్వే నియామకాల బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటించింది. ప్రతియేటా ఉద్యోగ కాలెండర్‌లో భాగంగా తాజాగా ఈ ప్రకటన వచ్చింది. గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2 స్థానాల్లో టెక్నీషియన్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అతి తక్కువ విద్యార్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. అర్హతలు, ఏమిటి? ఎలా ఎంపిక చేస్తారో వివరాలు తెలుసుకుందాం.

Also Read: Indian Railways Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు

దరఖాస్తు తేదీలు:
ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 4 వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం
టెక్నీషియన్‌ గ్రేడ్‌ 1: ఐదో వేతన స్థాయిలో జీతం ఉంటుంది. అంటే తొలి జీతం రూ.29,200
టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3: రెండో వేతన స్థాయిలో ఉంటుంది. అంటే ప్రారంభ జీతం రూ.19,000.

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

పరీక్ష ఫీజు:
జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు రూ.500. ఇక ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగి, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనార్టీలు, ఈబీసీలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగాలకు ఎంపిక పద్ధతి
కంప్యూటర్‌ బేస్‌ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఆర్‌ఆర్‌బీ ఎంపిక చేయనుంది. ప్రతిభ కనబరిచే అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు దక్కనున్నాయి.

అర్హతలు ఏంటి?
అర్హతలను ఇంకా ప్రకటించలేదు. కొద్ది రోజుల్లో సవివరమైన ఉద్యోగ ప్రకటన విడుదల చేయనుంది.

అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు లోకో పైలెట్‌ ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐటీఐ విద్యార్హతతో ఉద్యోగావకాశాలకు ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా విడుదల కానున్న టెక్నీషియన్‌ పోస్టు ఉద్యోగాలకు భారీ డిమాండ్‌ అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగాల భర్తీ ఉండనుంది. ఎంపికైన అభ్యర్థులు తమ స్వరాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పని చేసే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే ముందు వివరాలన్నీ పరిశీలించాల్సి ఉంది. కాగా నకిలీ ఉద్యోగ ప్రకటనల విషయంలో అప్రమత్తం కూడా ఉండాలి. ఆర్‌ఆర్‌బీ పేరుతో చాలా నకిలీ ఉద్యోగ ప్రకటనలు కూడా వస్తున్నాయి. మీకు ఏ సమాచారం కావాలన్నా అధికారిక ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News