సిగరెట్ తాగుతున్న (Smoking) వారికి ఆరోగ్యానికి మంచిది కాదని, చుట్టూ ఉన్న వారికి కూడా హాని చేస్తుందని హితబోధ చేస్తుంటాం. తరచుగా సినిమాలు, సీరియల్స్ లాంటి వాటిలోనూ ధూమపానం, మధ్యపానంపై హెచ్చరిస్తున్నారు. కానీ మనుషులే కాదు జంతువులు సైతం చెడు అలవాట్ల బారిన పడుతున్నారు. మనుషులు చేసే తప్పిదాలకు అవి తమ ప్రవర్తనను మార్చుకుంటున్నట్లు కొన్ని సందర్భాలలో దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. Nishabdham Trailer: అంచనాలు పెంచేస్తోన్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ పీత ఓ రేంజ్‌లో స్మోకింగ్ (Crab Smoking) చేస్తోంది. ఎవరో తాగి పడేసిన సిగరెట్ పీకను పట్టుకుని దమ్ము లాగుతూ కనిపించింది. ఇది చూసిన వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్ అవుతోంది. అటవీశాఖ అధికారి సుశాంత నందా ఈ వీడియోపై ఆవేదన వ్యక్తం చేశారు. AP Police Seva App: ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్



అటవీశాఖ అధికారులు అంటే జంతువులు, వన్య ప్రాణాలపై ఎంతో మమకారం పెంచుకుంటారు. అలాంటిది పీత సిగరెట్ తాగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటుందని బాధ పడ్డారు. మనుషులు వారి వ్యక్తిత్వాలతో ఎలాంటి వాతావరణాన్ని అయినా నాశనం చేయగలరని, ఆఖరికి ఎవరో తాగి పడేసిన సిగరెట్ పీకను పీత తాగడం చూస్తుంటే ఇదో పీడకలలాగ ఉందని ట్వీట్ చేశారు. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe