cow showing affection towards child video: చాలా మంది ఇటీవల కాలంలో మూగ జీవాల్ని ఎక్కువగా పెంచుకుంటున్నారు. మనుషుల కన్నా.. వీటితోనే ఎక్కువగా ఒకరకమైన ప్రేమను కల్గి ఉంటున్నారు. అయితే.. కొంత మంది కుక్కలు, పిల్లులు, ఏనుగుల్ని సైతం తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు. అంతేకాకుండా.. తమ ఇంట్లో పెంచుకుంటున్న మూగజీవాల్ని అచ్చం తమ ఇంటి మనుషులు మాదిరిగా చూసుకుంటారు. మంచి ఫుడ్ ను తినేందుకు ఇస్తుంటారు. అంతే కాకుండా... వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



నోరులేని జీవాలు సైతం..తమ యజమాని పట్ల అంతే ప్రేమతో ఉంటాయి. అవి ఒక్కనిముషం కూడా వదిలి ఉండవు. తమ ఓనర్ కన్పించకుంటే... అస్సలు తినవు. కొన్నిసార్లు కొత్త వాళ్లు ఎవరైన ఇంట్లోకి వస్తే  అలర్ట్ చేస్తాయి. అంతేకాకుండా.. కొత్త వాళ్లను దగ్గరకు రానివ్వదు. అయితే.. ఒక వ్యక్తి తన  ఇంట్లో ఆవుల్ని పెంచుకుంటున్నాడు. ఆ ఆవు అంటే యజమానికి ఎంతో ప్రేమ. రోజు దానికి మేత పెడుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.


మంచిఫుడ్ ను తినేందుకు సైతం ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో.. ఇటీవల ఓనర్ కు బుడ్డొడు పుట్టాడు. అప్పడు పిల్లాడ్ని.. ఆవు  షెట్ లో ఉంచి.. యజమాని తన పనుల్లో బిజీగాఉన్నాడు. అప్పుడు.. ఆవు ఆ పిల్లాడ్ని ప్రేమతో తన దగ్గరకు తీసుకుంది. అంతేకాకుండా.. ఆవును తన నాలుకతో  నాకుతూ.. తన ప్రేమను సైతం చూపించింది.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Read more:Viral Video: ఇదేం పైత్యం.. బావి మీద కూర్చుని ఆ తల్లి ఏంచేస్తుందో తెలిస్తే.. చీపురు తిరగేస్తారు.. వీడియో వైరల్..


తన ఇంట్లో ఆవును యజమాని కట్టేశాడు.  సాధారణంగా ఆవులు తమ నాలుకతో , మనుషుల్ని ప్రేమతో నాకుతుంటాయి. ఈ విధంగా తన ప్రేమను చూపిస్తాయి. కొంత మంది యజమానులు ఆవుల మెడ భాగానికి తల భాగంలో నిమురుతు ఉంటారు. అయితే.. ఇక్క ఆవుమాత్రం తన యజమాని కొడుకు పట్ల తన  ప్రేమను చాటుకుంది. తన నోటితో ఒక క్లాత్ మీద పడుకుని ఉన్న..బుడ్డొడినితనవైపు లాక్కుని, ప్రేమతో తననోటితో నాకుతూ తన ప్రేమను చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం వావ్.. మూగజీవాలకు ఎంత ప్రేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.