Viral video: క్రేజీ క్రేజీ వంటకాల గురించి చాలాసార్లు విని ఉంటాం. ముఖ్యంగా రెగ్యులర్​గా తినే ఫుడ్​ ఐటమ్స్​లో కొత్త కొత్త పదార్థాలు చేర్చి వాటికి డిఫరెంట్​ పేర్లు పెడుతుంటారు చాలా మంది. ఉదాహారణకు దోశ మొదట మసాలా, ఉల్లి వంటి వాటికే పరిమితమయ్యేది. ఇప్పుడు పన్నీర్ దోశ, చీజ్​ దోశ, చికెన్ దోశ ఇలా ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ఇంకా చాలా వంటకాలు, ఆహార పదార్థాలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వీటిని మాత్రమే క్రేజీ వంటకాలు అనుకుంటే మీరు పొరబడ్డట్లే.. అంతకు మించి అనే డైలాగ్​ను గుర్తు చేస్తూ.. జపాన్​లోని ఓ రెస్టారెంట్​ విచిత్రమైన కాంబినేషన్​లో ఓ కొత్త రకం డిష్ సర్వ్ చేస్తోంది. ఆ వంట చూస్తే ఇదెక్కడి కాంబినేషన్​ రా నాయనా అనుకోక మానరు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఆ రెస్టారెంట్​కు వచ్చే వాళ్లు మాత్రం ఈ విచిత్రమైన డిష్​ను లొట్టలేసుకుంటు తింటూ తెగ ఎంజాయ్​ చేస్తున్నారు.


ఇంతకీ ఆ డిష్ ఏమిటంటే?


రామెన్ (నూడుల్స్​తో కూడిన సూప్​)లో ఐస్​ క్రీమ్​లో మిక్స్ చేసి ఇస్తోంది​ ఓసాకా పట్టణంలోని ఫ్రాంకెన్ అనే రెస్టారెంట్​. రామెన్ ఏమో వేడి వేడిగా కారంగా ఉండే డిష్​ కాగా.. ఐస్ క్రీమ్​ చల్లగా, తియ్యగా ఉండే ఫుడ్ ఐటం. ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఓ హోటల్​లో సర్వ్ చేస్తున్నారు.


ఈ విచిత్రమైన డిష్​కు సంబంధించి jesseogn అనే ఇన్​స్టా యూజర్​ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో అక్కడ ఐస్​క్రీమ్​తో కూడి రామెన్​ను ఎలా సర్వే చేస్తున్నారు.. కస్టమర్లు ఎంత ఇష్టంగా దానిని టెస్ట్ చేస్తున్నారు అనే దృష్యాలు ఉన్నాయి.


ఇక ఈ వీడియో చూసిన చాలా మంది ఇదే క్రేజీ కాంబినేషన్ రా బాబోయ్ అంటు నవ్వుకుంటున్నారు. మరికొందరేమో అలా అస్సలు బాగుండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 1.67 లక్షల మంది లైక్ చేశారు. వేలాది మంది కామెంట్స్​ చేశారు. మరి నూడుల్స్​లో, ఐస్​క్రీమ్​ కాంబినేషన్ ఎలా ఉందో మీరు చూసేయండి ఇప్పుడే.



Also read: Dog Volleyball: మనుషుల్లా వాలీబాల్ ఆడుతున్న వీధి శునకాలు.. వీడియో వైరల్!


Also read: King Cobra: 12 అడుగులు పొడవున్న భయంకరమైన కళింగ సర్పాన్ని ఎప్పుడైనా చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook