Viral Videos: ట్రెయిన్లో సీటు దొరక్కపోతే మీరైతే ఏం చేస్తారు ? ఇదిగో ఈ వీడియో చూడండి
ట్రైన్‌లో సీటు కోసం తాను కూర్చున్న బోగీ అంతా వెతికిన ఓ యువకుడికి సీటు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. తాను ఉన్న బోగీలోనే కాకుండా.. ట్రెయిన్‌లోని ఇతర బోగీలు సైతం వెతికాడు. ఫలితం లేకపోయింది. దూర ప్రయాణం చేయాల్సి వస్తే రైలులో సీటు (Train seats) లేకుండా ప్రయాణం చేయడం చాలా అంటే చాలా చాలా కష్టం.
Viral Video of Jugaad for train seat: అవసరం ఏమైనా చేయిస్తుంది. అత్యవసరం ఇంకేమైనా చేయిస్తుంది. ఏదైనా తప్పనిసరిగా కావాలి అని బలంగా ఉంటే.. ఆ అవసరం కోసం, ఆ సమస్యను అధిగమించడం కోసం ఇంకో అడుగు ముందుకేసి, ఎవరు ఏం అనుకుంటారో అనే మరో ఆలోచన లేకుండా ఏం చేయడానికైనా వెనుకాడరు. ఒక్కోసారి దానికి క్రియేటివిటీ అనే పేరు కూడా పెట్టుకుంటారు. కానీ చూసే వాళ్లు మాత్రం ఆ పనినే కొన్నిసార్లు కోతి వేషాలు అని కూడా అంటుంటారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని డౌట్ వచ్చిందా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి. ఓ ట్రైన్‌లో సీటు కోసం తాను కూర్చున్న బోగీ అంతా వెతికిన ఓ యువకుడికి సీటు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. తాను ఉన్న బోగీలోనే కాకుండా.. ట్రెయిన్‌లోని ఇతర బోగీలు సైతం వెతికాడు. ఫలితం లేకపోయింది. దూర ప్రయాణం చేయాల్సి వస్తే రైలులో సీటు (Train seats) లేకుండా ప్రయాణం చేయడం చాలా అంటే చాలా చాలా కష్టం. ఎక్కడా సీటు దొరక్కపోవడంతో రెండు సీట్ల మధ్య బెడ్‌షీట్‌ను ఉయ్యాల తరహాలో వేళ్లాడదీసి కట్టి అందులో హాయిగా కూర్చుని ఉయ్యాల ఊగడం ప్రారంభించాడు.
Also read : Viral Pre Wedding Photoshoot: గంటలో పెళ్లి.. జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తోన్న పెళ్లి కూతురు
అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాని తోటి రైలు ప్రయాణికులు (Train passengers) అలా చూస్తుండిపోయారు. అతడి ఉపాయం చూసి.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాక, నోట మాట రాక ఉండిపోయారు. అతడి వల్ల తమకు అసౌకర్యం అనుకున్న వాళ్లు అతడితో గొడవ పడే ఉంటారు అది వేరే విషయం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వైరల్ వీడియో (Viral videos) చూసి నెటిజెన్స్ మాత్రం రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అతడి అతి తెలివి చూసి ముక్కున వేలేసుకుంటే.. ఇంకొంత మంది ఫక్కున నవ్వుతున్నారు.
Also read : వేగంగా వస్తున్న రైలు.. పక్కన నిలబడి వీడియో తీయబోయి 22 ఏళ్ల యువకుడు మృతి Video Viral
Also read : స్పృహ కోల్పోయిన లేడీ డ్రైవర్.. ప్రాణాలకు తెగించి ఆ కారుకు తన కారును అడ్డుపెట్టి.. వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook