Viral Pre Wedding Photoshoot: ఈ అమ్మడు పెళ్లి చేసుకోటానికి వెళ్తుందా..? లేక WWE కి వెళ్తుందా..??

ఎవరైన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ మంచి మంచి ప్రెదేశాలలో.. దూరంగా ఆకర్షణీయమైన ప్రాంతాలలో తీసుకుంటారు కదా! మరి ఈ అమ్మడు మాత్రం పెళ్లికి గంట ముందు జిమ్ లో ఎలా కష్టపడుతుందో మీరే ఓ లుక్కేయండి!  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 06:46 PM IST
  • పెళ్లికి ముందు జిమ్‌లో వధువు కసరత్తులు
  • ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఐపీఎస్ అధికారి
  • సొషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్
Viral Pre Wedding Photoshoot: ఈ అమ్మడు పెళ్లి చేసుకోటానికి వెళ్తుందా..? లేక WWE కి వెళ్తుందా..??

Bride doing Tribal Exercises in the Gym 1 Hour Before Wedding: ఈ మధ్య కాలంలో చాలా పెళ్లి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి, వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం.. కావున క్షణాని ఒక జ్ఞాపకంగా.. జీవితాంతం గుర్తుండిపోయేలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు వధూ-వరులు. ప్రస్తుతం ఒక వధువు యొక్క వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. పెళ్లికూతురు ముస్తాబై.. జిమ్ లో వర్కౌట్ చేయటమే..!!

పెళ్లికి ముందు జిమ్ లో పెళ్లికూతురు కసరత్తులు.. 

సాధారణంగా అమ్మాయిలు పెళ్లి అనగానే.. ఖరీదైన బట్టలు, నగలు, మేకప్ వంటి వాటిని వేసుకోటానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం.. అందంగా రెడీ అయ్యి.. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ (Pre Wedding Photoshoot) అనేది ఒక ఆచారంగా మారిపోయింది. ఇలాంటి డిఫరెంట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లు చాలానే వైరల్ అయ్యాయి..

Also Read: వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!

కానీ ఇపుడు మీరు చూడబోయే వీడియో మీ మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం.. ఒక వధువు.. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లో జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. 

ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి 

ఐపీఎస్ (IPS) అధికారి రూపిన్ శర్మ (Rupin Sharma) తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ప్రకారం.. ఈ వీడియోకి "ప్రీ వెడ్డింగ్ షూట్.. ఆజ్ రాజ్ కా ఖులా హిమ్మత్ ఖా" Aaj raaz khula himmat ka...... (ధైర్యం యొక్క రహస్యం ఈ రోజు వెల్లడైంది) అనే ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.. కొందరు నెటిజన్లు ఈ పెళ్లికూతురుపై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 543 రోజుల కనిష్టానికి కొత్త కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News