వేగంగా వస్తున్న రైలు.. పక్కన నిలబడి వీడియో తీయబోయి 22 ఏళ్ల యువకుడు మృతి Video Viral

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఓ 22 ఏళ్ల యువకుడు రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి హైస్పీడ్ రైలుతో వీడియో తీస్తూ.. మృతి చెందాడు. అయిన ఆ వైరల్ వీడియో మీరే చూడండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 09:40 PM IST
  • క్రేజీ పిచ్చితో ప్రాణాలు కోల్పయిన యువకుడు
  • కదులుతున్న రైలు పక్కన నిలబడి వీడియో తీయాలనుకున్న యువకుడు
  • వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు
వేగంగా వస్తున్న రైలు.. పక్కన నిలబడి వీడియో తీయబోయి 22 ఏళ్ల యువకుడు మృతి Video Viral

Man Making Video With High Speed Tain: సోషల్ మీడియాలో లైక్స్ కోసం, ఫాలోవర్స్ సంఖ్య పెంచుకోటానికో లేదా రాత్రికి రాత్రే ఫేమస్ అవటానికి యువత పలు రకాల సాహసాలు చేస్తూ ఆపదలు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పనుల వల్ల చాలా మంది తమ ప్రాణాలను సైతం వదులుకున్న వీడియోలు మనం చాలానే చూసాం.. 

ఇపుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఒక యువకుడు హైస్పీడ్ తో వస్తున్న రైలు పక్కన నిలబడి వీడియో  క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో జరిగింది. 

Also Read: ఓ పక్కా అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చ.. మరో పక్క నిద్రపోతున్న మంత్రి పేర్నినాని

వేగంగా రైలు.. నిలబడ్డ యువకుడు.. 

హోషంగాబాద్ జిల్లా ఇటార్సీ వద్ద ఉన్న శరద్‌దేవ్ బాబా రైల్వే కల్వర్టుపై ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇటార్సీ-నాగ్‌పూర్ రైల్వే ట్రాక్‌పై ఈ సంఘటన జరిగిందని హోషంగాబాద్‌కు చెందిన పత్రౌత ఇన్‌ఛార్జ్ నాగేష్ వర్మ తెలిపారు. మృతుడు సమీపంలోని పంజరకలా గ్రామానికి చెందిన సంజు చౌరేగా (22) గుర్తించారు.

సోషల్ మీడియాలో LIVE వీడియో.. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా.. సంజూ అనే యువకుడు కదులుగుతున్న రైలు ముందు నిలబడి వీడియో తీయాలని, సోషల్ మీడియాలో LIVE పోస్ట్ పెట్టడటంతో వెలుగులోకి వచ్చిందని..  క్రమంలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పయడని స్టేషన్‌ ఇంచార్జి నగేష్‌ వర్మ తెలిపారు. 

Also Read: వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!

దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు 

గాయపడిన సంజును వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News