భారతదేశం ( India ) సాహసాన్ని చూసి చైనాకు ( China ) భయం కలుగుతోంది. దీనికి ఉదాహరణగా ఒక వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఈ వీడియోలో చైనా సైనికులు భారతీయ సైనికులను ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు. ఈ వీడియోను తైవాన్ కు (Taiwan ) చెందిన ఒక వైబ్ సైట్ తన లైవ్ న్యూస్ లో ప్రసారం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి


ఈ వీడియోను చూసిన పాకిస్తాన్ కు ( Pakistan ) చెందిన ప్రముఖ కమీడియన్ జైద్ హామీద్ తన ట్విటర్ హ్యండిల్ లో షేర్ చేశాడు.


చైనా సైనికులు భారతీయ సైనికులతో, అమెరికా సైనికులతో పోరాటానికి సిద్ధం అంటూ అక్కడి అధికారులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉంది. ఆ వాస్తవం ఈ వీడియోలోనే ఉంది. ప్రపంచం ముందు తమ వీరత్వం గురించి ప్రకటించుకునే చైనా. తన సైనికులు ఇలా ఏడుస్తూ.. యుద్ధానికి వెళ్లం అంటుంటే..ఏం సమాధానం ఇస్తుంది అనేది చూడాలి. 



ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి


ఈ వీడియో వాస్తవాధీన రేఖ ( LAC ) వద్ద ఇప్పటికే  విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది సైనికులది. ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి.



15 సెకన్ల ఈ వీడియోను తైవాన్ కు చెందిన ఒక వైబ్ సైట్ లైవ్ లో చూపించింది. చైనాకు చెందిన ఈ సైనికులు తమ భాషలో పాట పాడుతున్నారు. కానీ వారి ముఖం చూస్తే వారి పరిస్థితి ఎలా ఉందో మీరే గమనించవచ్చు. 


ఈ వీడియోతో భారత్ సైనికులు అంటే చైనా సైనికులు భయపడతారు అనేది స్పష్టం అవుతోంది. సాహసం, తెగువే ప్రాణంగా జీవించే ప్రతీ భారతీయ సైనికుడిని చూసి చైనా సైనికులు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.


ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే   ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR