Viral Video: జంతువుల కొట్లాటకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా రెండు పులులు కొట్లాడుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో ఓ పులిని అడ్డుకునేందుకు రెండు పులులు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఆర్ఆర్ఆర్' యాక్షన్ సీన్ ను తలపిస్తూ..


సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. రెండు పులులు ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నట్లు కనిపిస్తుంది. అలా కొద్దిసేపు ఆ రెండు పులుల మధ్య తోపులాట జరుగుతూనే ఉంది. ఇది ఆర్ఆర్ఆర్ మూవీలోని ఎన్టీఆర్, పులితో చేసిన యాక్షన్ సీక్వెన్స్ ను తలపిస్తుంది. అదే సమయంలో మరో పులి దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 



అయితే ఈ వీడియోలోని రెండు పులులు.. ఓ ఆడ పులి కోసం కొట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలో బలమైన పులి గెలిచింది. ఈ వీడియోను IFS అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. "ఒక ఆడపులి కోసం రెండు మగ పులులు పోరాడుతున్నాయి. కానీ, వాటిలో పరాక్రమవంతుడు మాత్రమే యుద్ధంలో గెలిచి రాణిని పొందుతాడు" అని ట్వీట్ చేశారు.  


Also Read: Viral News: 10 రూపాయల నోటుపై ప్రేమ సందేశం.. ఫొటో వైరల్!


Also Read: Viral Video: రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడిన మహిళ.. వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook