Vodafone idea Bumper Offer: ఇండియాలోని ప్రముఖ టెలీకాం సంస్థ వోడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. డబుల్ డేటాతో పాటు వీకెండ్ డేటా రోల్ ఓవర్‌నైట్ సౌలభ్యంతో పాటు 60 శాతం క్యాష్‌బ్యాక్ ప్రకటిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వోడాఫోన్ ఐడియా (Vodafone idea) యూజర్ల కోసం అద్దిరిపోయే ఆఫర్ విడుదల చేసింది. ఈ రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 60 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం ప్రీ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందిస్తోంది. ఇప్పటికే డబుల్ డేటా, వీకెండ్ డేటా రోల్ ఓవర్ నైట్ ( Weekend data roll over night) అన్‌లిమిటెడ్ డేటా(Unlimited Data) అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా 199 రూపాయల కంటే ఎక్కువ రీఛార్జ్ చేయించుకుంటే అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం పరిమితి..ప్యాక్ ధరతో మారుతుంటుంది. 4 వందల కంటే తక్కువ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయించుకుంటే 20 రూపాయల క్యాష్‌బ్యాక్,  4 వందల నుంచి 2 వేల 595 రూపాయల రీఛార్జ్ అయితే 60 రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇక అన్‌లిమిటెడ్ ప్లాన్ గా ఉన్న 199 రూపాయలు 405 రూపాయల మద్య ఉన్న కాంబో ప్లాన్ రీఛార్జ్ చేయించుకుంటే 20 రూపాయలు వెనక్కి క్యాష్‌బ్యాక్ రూపంలో వస్తాయి. అదే విధంగా 499 రూపాయలు, 555 రూపాయలు, 558 రూపాయలు, 595 రూపాయలు, 601 రూపాయల రీఛార్జ్ చేయించుకుంటే 40 రూపాయల వరకూ క్యాష్ బ్యాక్ అందుతుంది. అంతకంటే ఎక్కువ రీఛార్జ్ అయితే 60 రూపాయలు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 


28 రోజుల వాలిడిటీ ప్లాన్  రీఛార్జ్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ రీఛార్జ్‌లు చేయించుకుంటే క్యాష్‌బ్యాక్ ( Cashback offer) ఏప్రిల్ 10వ తేదీలోగా జమ అవుతాయని వోడాఫోన్ ఐడియా తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ కూపన్లు క్రెడిట్ అయిన తేదీ నుంచి 30 రోజుల వరకూ చెల్లుబాటు ఉంటుందని తెలిపింది. 40, 60 రూపాయల కూపన్లు మాత్రం 60 నుంచి 90 రోజుల వరకూ చెల్లుబాటవుతాయి.


Also read: WhatsApp Holi Stickers: వాట్సాప్ హోలీ స్టిక్కర్లు ఇక ఈజీగా డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook