WhatsApp Holi Stickers: వాట్సాప్ హోలీ స్టిక్కర్లు ఇక ఈజీగా డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేసుకోండి

WhatsApp Holi Stickers: దేశ వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను తమ తోచినట్లుగా జరుపుకుంటున్నారు. అయితే మీ బంధువులు, సన్నిహితులకు హోలీ స్టిక్కర్లు పంపుతూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాప్తి సమయంలో ఇంటి నుంచి ఎక్కువ మంది బయటకు రావడం లేదు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 29, 2021, 12:43 PM IST
  • ప్రజలు రంగుల పండుగను తమ తోచినట్లుగా జరుపుకుంటున్నారు
  • హోలీ స్టిక్కర్లను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకుని షేర్ చేసుకోండి
  • వాటిని పంపి పండుగను రంగులమయం చేసుకోవచ్చు
WhatsApp Holi Stickers: వాట్సాప్ హోలీ స్టిక్కర్లు ఇక ఈజీగా డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేసుకోండి

WhatsApp Holi Stickers: కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ దేశ వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను తమ తోచినట్లుగా జరుపుకుంటున్నారు. అయితే మీ బంధువులు, సన్నిహితులకు హోలీ స్టిక్కర్లు పంపుతూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాప్తి సమయంలో ఇంటి నుంచి ఎక్కువ మంది బయటకు రావడం లేదు. కనుక మీరు వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు డౌన్‌లోడ్ చేసుకోండి. వాటిని పంపి పండుగను రంగులమయం చేసుకోవచ్చు. 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు హోలీ స్టిక్కర్స్ పంపే విధానం..
Step 1: వాట్సాప్ ఛాట్ ఓపెన్ చేసి ఇమేజీ ఐకాన్‌పై క్లిక్ చేయండి. చాట్ బార్‌లో ఇది ఎడమవైపు ఉంటుంది

Step 2: కింద నుంచి స్టిక్కర్స్ ఆప్షన్ ఎంచుకోవాలి

Step 3: ఆ జాబితాలో డిఫాల్ట్ స్టిక్కర్ ప్యాక్ సెలక్ట్ చేసుకోవాలి ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే హోలీ పండుగ(Holi 2021) స్టిక్కర్లు కనిపిస్తాయి

Also Read: Holi 2021 Celebration Ban: హోలీ వేడుకలు నిషేధించిన, ఆంక్షలు విధించిన రాష్ట్రాలు ఇవే

Step 4: అందులో కిందకి స్క్రోల్ చేసి 'Get More Stickers' మీద క్లిక్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావాల్సిన స్టిక్కర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Step 5: 'add to WhatsApp' బటన్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ చేస్తే వాట్సాప్‌లో యాడ్ అవుతాయి.

Step 6: గూగుల్ ప్లే‌లో హోలీ స్టిక్కర్లు సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత వాట్సాప్‌లో స్టిక్కర్ సెక్షన్‌లో ఇవన్నీ కనిపిస్తాయి. వాటిని మీ మిత్రులను, సన్నిహితులకు ఎంచక్కా షేర్ చేసి హోలీ విషెస్ చెప్పేయండి

అయితే యాప్ స్టోర్‌లో వాట్సాప్ స్టిక్కర్లు అందుబాటులో లేవు. అయితే ఇతరులు మీకు పంపిన స్టిక్కర్లు సేవ్ చేసుకుని ఇతరులకు, వాట్సాప్ కాంటాక్ట్స్‌కు షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్(WhatsApp) పేరెంట్ కంపెనీ పేస్‌బుక్ హోలీ థీమ్ అవతార్స్‌ను అందిస్తోంది.

Also Read: Holi 2021 Skin Care: హోలీ పండుగతో జర జాగ్రత్త, ఏమేం పాటిస్తూ హోలీ జరుపుకోవాలంటే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News