WhatsApp: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్..సెలెక్టెడ్ యూజర్స్‌కి మాత్రమే ఆన్‌లైన్ స్టేటస్ కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు..
WhatsAPP Online Status: వాట్సాప్‌లో త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్స్ తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను కనిపించకుండా సెట్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది.
WhatsAPP Online Status: వాట్సాప్‌లో త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్స్ తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను కనిపించకుండా సెట్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్ ద్వారా సదరు యూజర్ ఆన్‌లైన్ స్టేటస్ ఎవరికీ కనిపించదు. వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ఫీచర్ ద్వారా సెలెక్టెడ్ యూజర్స్‌కు మాత్రమే ఆన్‌లైన్ స్టేటస్ కనిపించకుండా సెట్ చేసుకునే ఆప్షన్ రాబోతోంది. ఈ మేరకు ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులపై వాట్సాప్ కసరత్తు చేస్తోంది.
WABetaInfo ప్రకారం.. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ని అభివృద్ది చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్స్ తమ ఆన్‌లైన్ స్టేటస్ కాంటాక్ట్ లిస్టులో ఎవరికి కనిపించాలో.. ఎవరికి కనిపించకూడదో సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మొదట ఐఓస్, ఆ తర్వాత ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌తో పాటు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ సెలెక్టెడ్ యూజర్స్‌కి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. త్వరలోనే మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. ఈ ఫీచర్‌తో మరిన్ని ఎమోజీలు అందుబాటులోకి వస్తాయి. ఇందుకోసం ఎమోజీ రియాక్షన్స్‌లో ప్లస్ ఐకాన్ ఆప్షన్ కొత్తగా చేర్చే అవకాశం ఉంది.
Also Read: Jagga Reddy: కాంగ్రెస్ లో ముదిరిన వార్.. రేవంత్ రెడ్డితో తాడోపేడో! రేపు జగ్గారెడ్డి సంచలన ప్రకటన..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook