WhatsApp Sticker Packs Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గత కొన్నేళ్లుగా వెరైటీ స్టిక్కర్స్ అందిస్తోంది. తద్వారా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ఊహించనంత పోటీ ఇచ్చి మార్కెట్‌ను పెంచుకుంది. తాజాగా ఫాదర్స్ డే 2021 సందర్భంగా పాపా మేరే పాపా అని సరికొత్త స్టిక్కర్స్ విడుదల చేసింది. పండుగ, వేడుకలు, సందర్భానుసారం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు యాప్ ద్వారా వాట్సాప్ స్టిక్కర్లు తీసుకొస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో వాట్సాప్ సంస్థ ఐఓఎస్ వినియోగదారులకు ఐఓఎస్ బేటా వెర్షన్‌లో కొత్త స్టిక్కర్ ఫీచర్ (WhatsApps Fast Playback Feature) ప్రవేశపెట్టింది. బేటా వెర్షన్‌లో స్టిక్కర్లను పరీక్షించిన తరువాత లైవ్‌గా లాంచ్ చేస్తారు. అప్పుడు వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు స్టిక్కర్ ప్యాక్స్ అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్ ఐఓఎస్ 2.21.120.13లో అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. వాట్సాప్ స్టిక్కర్లను మీరు మీ స్నేహితులు, సన్నిహితులకు ఫార్వార్డ్ చేయవచ్చు.


Also Read: BSNL Recharge Plan: జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్, 105GB అధికం


వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్ ఫార్వార్డ్..
ఇప్పటివరకూ వినియోగదారులు మెసేజింగ్ యాప్ ఛాట్ ద్వారా వాట్సాప్ కాంటాక్ట్స్‌కు వాట్సాప్ స్టిక్కర్‌ (WhatsApp Stickers)ను మాత్రమే ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సరికొత్త ఫీచర్‌తో మొత్తం స్టిక్కర్ ప్యాక్‌ను సైతం ఫార్వార్డ్ చేసేందుకు వీలు కల్పించింది. వాట్సాప్ స్టిక్కర్ స్టోర్‌కు వెళ్లాలంటే, ఛాట్ ఓపెన్ చేసి ఎమోజీ బటన్ మీద ట్యాప్ చేయాలి. ఆపై స్టిక్కర్ ఐకాన్ సెలక్ట్ చేసి, ప్లస్ ఐకాన్ (+ Icon) మీద ట్యాప్ చేస్తే వాట్సాప్ స్టిక్కర్ స్టోర్ ఓపెన్ అవుతుంది. 


ఒకసారి వాట్సాప్ స్టిక్కర్ స్టోర్ ఓపెన్ అయ్యాక.. అందులో చాలా రకాల స్టిక్కర్ల ప్యాక్‌లు మీకు కనిపిస్తున్నాయి. అందులో మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే లైబ్రరీకి వచ్చి చేరతాయి. ఆ తరువాత మీరు ఫార్వార్డ్ బటన్ చెక్ చేస్తే స్టిక్కర్ పైభాగంలో బాణం గుర్తు కనిపిస్తుంది. ఆ బటన్ మీక క్లిక్ చేసి మీకు కావలసిన వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్‌కు స్టిక్కర్ ప్యాక్‌ను సెండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ డీప్ లింక్ పంపుతుంది. తద్వారా మీకు త్వరగా స్టిక్కర్లను గమనించి మీకు కావాల్సిన స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Also Read: Bank Timings: తెలంగాణలో పూర్తి స్థాయిలో బ్యాంకు సేవలు, లేటెస్ట్ టైమింగ్స్ ఇవే


ప్రస్తుతానికి అధికారిక వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్స్‌కు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుందని WABetaInfo తెలిపింది. థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్స్ వాట్సాప్ స్టిక్కర్ స్టోర్‌లో అందుబాటులో ఉండవు. ప్రస్తుతానికి వాట్సాప్ బీటా ఐఓఎస్ యాప్‌లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. దీనికి మరిన్ని మార్పులు చేసి త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ యోచిస్తోంది.


Also Read: International Yoga Day 2021 Images: భారత్‌లో ఇంటర్నేషనల్ యోగా డే 2021 ఫొటోస్ గ్యాలరీ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook